vijayashanthi
Politics

Vijayashanthi: రాములమ్మ రాకతో.. ఆ పార్టీకి గడ్డుకాలమేనా?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Vijayashanthi: కేసీఆర్ మోసాలను చట్టసభల వేదికగా బహిర్గతం చేస్తానని, రాష్ట్రాన్ని అప్పగిస్తే తొమ్మిదిన్నరేండ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు ఎందుకైందో నిలదీస్తానని ఎమ్మెల్సీ విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను మొదలుపెట్టేనాటికి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను తల్లి తెలంగాణ పార్టీని స్థాపిస్తే హింస పెట్టి టీఆర్ఎస్‌లో విలీనం చేయించుకున్నారని ఆరోపించారు.

ఆ పార్టీలో ఉన్నంతకాలం ప్రతీ రోజూ తనకు అవమానాలేనని గుర్తుచేసుకున్నారు. గాంధీభవన్‌లో గురువారం సాయంత్రం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన లోపలే లేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయన ఒక్కరి సొత్తు కాదని అన్నారు.

గతంలో తాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేశానని, ఆ పార్టీలకు తన వంతు సేవ చేశానని, కానీ తెలంగాణ విషయంలో ఆ రెండు పార్టీలు సరైన నిర్ణయాలు తీసుకోనందునే వదిలేయాల్సి వచ్చిందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని తెరపైకి తెచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ఆశతో, ఆకాంక్షతో తాను అప్పట్లో బీజేపీలో చేరాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

విజయశాంతికి తెలంగాణతో సంబంధం లేదని ప్రశ్నించేవారికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభించే నాటికి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ కంటే ముందే తాను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ప్రస్తావించానని అన్నారు. కానీ బీజేపీ సరైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యంతో విడిచిపెట్టాల్సి వచ్చిందన్నారు.

తెలంగాణ డిమాండ్‌తో తల్లి తెలంగాణ పార్టీని పెట్టానని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశయం కూడా అదే కావడంతో రెండు పార్టీలు ఎందుకనే చర్చ జరిగిందని ఆమె గుర్తుచేశారు. హింసపెట్టి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో కేసీఆర్ విలీనం చేయించుకున్నారని, ఆ తర్వాత మోసం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సొత్తు కాదని, రాష్ట్ర సాధన వెనక తన వంతు కృషి ఉన్నదన్నారు. కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారని, కేవలం దొరలు ఓటేస్తేనే ముఖ్యమంత్రి అయ్యారా అని ఎదురు ప్రశ్నించారు.

ఇప్పుడు తాను ఎమ్మెల్సీ కాబోతున్నందున ఆయన బండారం బయటపెడతానని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. చట్టసభల్లో తాను గొంతు విప్పితే హార్ట్ ఎటాక్ వస్తుందని భయం అవుతున్నదా అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను నిందలు వేయడం లేదని, గట్స్ ఉన్న మహిళగా వీటిని ప్రస్తావిస్తున్నానని అన్నారు. ఆ పార్టీలో ఉన్నంతకాలం తాను ప్రతీ రోజు అవమానాలనే ఎదుర్కొన్నానని అన్నారు.

తెలంగాణ వ్యతిరేకుల్ని బీజేపీ ఇక్కడ దించబోతున్నదని ఆరోపించిన విజయశాంతి.. నీ బాంచెన్.. కాళ్ళు మొక్కుతా.. అనే పరిస్థితికి మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కసరత్తు చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినందుకు తాను ఆ పార్టీని వదిలేసి బైటకు వచ్చానని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్నేహితులని ఆరోపించారు. ఇంతకాలం కాపలా కుక్కల్లాగా రాష్ట్రాన్ని కాపాడుకున్నామని, ఇకపైన బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ళతో మరోసారి పరిరక్షణ కోసం ఉద్యమం తప్పదన్నారు.

సోనియాగాంధీ ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇచ్చారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కష్టపడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు అన్యాయం జరగనివ్వకూడదని, కేసీఆర్ మోసాలను, రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని చట్టసభల వేదికగా ప్రశ్నించక తప్పదని, ఎమ్మెల్సీగా తాను ఆ బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు