Social Media Influencers
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Social Media Influencers: మొన్న నాని.. నిన్న సన్నీ.. నెక్స్ట్ ఎవరు?

Social Media Influencers: లోకల్ బాయ్ నాని ఇప్పటికే జైలు ఊసలు లెక్క పెడుతున్నాడు. అలాగే ట్రావెలర్ యూట్యూబర్ సన్నీ రేపో మాపో అరెస్ట్ కాబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. మొన్నటి వరకు బెట్టింగ్ అంటూ నానా హంగామా చేసిన ప్రమోషన్ బ్యాచ్ సైలెంట్ కాగా, పోలీసులు మాత్రం బెట్టింగ్ భరతం పట్టేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ పుణ్యమా అంటూ బెట్టింగ్ యాప్స్ జోరు తగ్గిందని చెప్పవచ్చు.


తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సీనియర్ పోలీస్ అధికారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా సజ్జనార్ కు పోలీసింగ్ లో స్పెషల్ మార్క్ ఉందని చెప్పవచ్చు. ఫ్యాక్షనిస్ట్ జిల్లాగా పేరుగాంచిన కడప జిల్లాలో ఫ్యాక్షన్ ను కూకటివేళ్లతో అణచివేసేందుకు సజ్జనార్ కృషి ఎనలేనిది. ఎక్కడ విధులు నిర్వహించినా సజ్జనార్ మార్క్ అక్కడ ఉండాల్సిందే. ఇలా పోలీస్ అధికారిగా సజ్జనార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ విధులు నిర్వర్తిస్తున్నా, పోలీసింగ్ మాత్రం ఓ వైపు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా సజ్జనార్ కన్ను బెట్టింగ్ యాప్స్ పై పడింది. అమాయక యువకులను వల వేసి ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్ యాప్స్ భరతం పడుతున్నారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకొనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు అధికం కాగా, సమాజంపై దాని ప్రభావం అధికంగా చూపుతున్న పరిస్థితి.


అందుకే ఎలాగైనా ఇలాంటి ప్రచారాలు సాగిస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లను కట్టడి చేయాలని సజ్జనార్ భావించారు. అందుకే తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ ఎక్కు పెట్టారని చెప్పవచ్చు. తన ఎక్స్ ఖాతా ద్వారా సజ్జనార్ ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్ల వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఇలాంటి వాటిని నమ్మవద్దని యువకులను చైతన్య పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అలా వైజాగ్ కు చెందిన లోకల్ బాయ్ నాని వీడియోను సజ్జనార్ పోస్ట్ చేయగా, వైజాగ్ పోలీసులు రంగంలోకి దిగారు. అనధికార బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే సీరియస్ యాక్షన్ తప్పదని వైజాగ్ సీపీ బాగ్చి హెచ్చరించారు. అలాగే నానిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఫస్ట్ నాని వంతు రాగా, నెక్స్ట్ ట్రావెలర్ యూట్యూబర్ సన్నీ తెరపైకి వచ్చారు. ఈసారి సజ్జనార్ ను ఆదర్శంగా తీసుకున్న ఓ వ్యక్తి సూర్యాపేట జిల్లాలో సన్నీపై ఫిర్యాదు చేశాడు.

యూట్యూబ్ ద్వారా ఎందరో ఫాలోవర్స్ కలిగిన సన్నీ అనధికార బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు ప్రకటించారు. ఇలా బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ సమరం.. చిన్నచిన్నగా రెండు తెలుగు రాష్ట్రాలకు పాకిందని చెప్పవచ్చు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు ఇన్ఫ్లూయెన్సర్లు కాస్త వెనుకడుగు వేసినట్లు భావించవచ్చు.

యాప్స్ గురించి ప్రచారం చేసి లక్షలు దండుకొనే ఇన్ఫ్లూయెన్సర్లకు ఇక గడ్డు కాలమే. ఎందరో బెట్టింగ్ యాప్స్ దెబ్బకు అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడగా, సజ్జనార్ ఒక అధికారిగా స్పందించడంతో ఎన్నో ప్రాణాలు కాపాడినట్లేనంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది. కోట్ల మంది ఫాలోవర్స్ గల నా అన్వేషణ అన్వేష్ ఇటీవల సజ్జనార్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయని ఇన్ఫ్లూయెన్సర్ గా పేరు తెచ్చుకున్న అన్వేష్ ను సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.

Also Read: Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌పై కేసు నమోదు

అయితే మొన్న నాని, నిన్న సన్నీ, నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అనధికార బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారు తమ పంథా మార్చుకోకుంటే, కటకటాల పాలయ్యేందుకు సిద్దంగా ఉండాలని ఏపీ, తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎంతైనా బెట్టింగ్ యాప్స్ పై ప్రజల్లో ఊహించని చైతన్యం తీసుకువచ్చిన సజ్జనార్ ఐపీఎస్ కు ఓ సెల్యూట్ చేసేద్దాం అంటున్నారు యూత్.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?