Nagam Janardhan - Chandrababu
ఆంధ్రప్రదేశ్

Nagam Janardhan – Chandrababu: నాగంలో ఇంత మార్పేంటి? చంద్రబాబుతో భేటీ అందుకేనా?

Nagam Janardhan – Chandrababu: నాడు టిడిపి నేత.. నేడు బిఆర్ఎస్ నేత.. అయితేనేమి టిడిపి జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబును కలిశారు. టిడిపిలో కొనసాగిన సమయంలో చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించిన ఆ నేత, ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో చేయి చేయి కలిపారు. ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ భేటీ వెనుక అసలు మతలబు ఏంటంటూ రాజకీయ చర్చ సాగుతోంది.

తెలంగాణ పొలిటికల్ వింగ్ లో నాగం జనార్ధన్ రెడ్డి అంటే తెలియని వారే ఉండరు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల నాగం, పలు దఫాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా కూడా భాద్యతలు నిర్వర్తించారు. నాగం ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుండి ప్రారంభమైనా, మధ్యలో కాస్త రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి తొలిసారి 1983లో పోటీ చేసి కేవలం 52 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఆ రోజుల్లో ఇది సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి టికెట్ ఇవ్వక పోవడంతో, ఏకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్లీ ఓటమి చవిచూశారు.

ఇక మళ్లీ టిడిపిలో చేరి ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ విమర్శలు చేయడంలో నాగం తర్వాతే ఎవరైనా అంటారు రాజకీయ విశ్లేషకులు. అలా విమర్శల జోరు సాగిస్తూ పలుమార్లు నాగం వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పవచ్చు. టిడిపిలో ఉంటూ చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించారు నాగం.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం, బాబునే ధిక్కరించడంతో టిడిపి నుండి నాగం బహిష్కరణకు గురయ్యారు. ఆ సమయంలో తెలంగాణ వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బిజెపి, కాంగ్రెస్ చివరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇలా టిడిపికి దూరమైన నాగం పెద్ద షాకిచ్చారు.

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో నాగం భేటీ కావడం సంచలనంగా మారింది. పార్టీలోనే ఉండి ధిక్కారస్వరం వినిపించిన నాగం, హఠాత్తుగా చంద్రబాబును కలవడం పొలిటికల్ టాపిక్ గా మారింది. అయితే పాత విషయాలు మరచిపోయిన చంద్రబాబు, నాగంకు వెల్ కమ్ అంటూ స్వాగతం పలకడం, ఆ తర్వాత ఇద్దరూ చిరునవ్వులు చిందించడం విశేషం.

ప్రస్తుత రాజకీయాలతో పాటు, గత రాజకీయాలను కూడా ఇద్దరూ గుర్తు చేసుకున్నారని టాక్. కాగా వీరిద్దరి భేటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నాగం బీఆర్ఎస్ ను వీడనున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Heatwave Alert: మండిపోతున్న తెలంగాణ.. ఇవేమి ఎండలు బాబోయ్!

అయితే విజయవాడకు ఓ కేసు విషయంపై వెళ్లిన నాగం, తాడేపల్లి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాగం, ఏపీలో సీఎం చంద్రబాబును కలిసినట్లు తెలంగాణలో వైరల్ కాగా ఆ పార్టీ నేతలు అసలు విషయం ఏమిటని ఆరా తీస్తున్నారట.

మొత్తం మీద మర్యాదపూర్వక భేటీ అంటూ ప్రచారం సాగినా, కొందరు నెటిజన్స్ మాత్రం ఏదో ఉందని తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపడం విశేషం. తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసే అవకాశం ఉందంటూ రోజుకొక పుకారు వినిపిస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ కీలకంగా మారింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు