Half day Schools (Image Source: Pixabay)
తెలంగాణ

Half Day Schools: గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన

Half Day Schools: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండ వేడిమి పెరగ్గా.. మార్చి ప్రారంభమయ్యే సరికి భానుడి భగ భగలు మరింత పెరిగాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడానికి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ విద్యార్థులతో పాటు ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పింది. వేసివి దృష్ట్యా ఒంటి పూట బడులను ప్రకటించింది.

ఎప్పటి నుంచి అంటే

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు (Half Day Schools) జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేవరకూ ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి మ.12.30 గంటల మధ్య మాత్రమే పాఠశాలలు పనిచేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలకు సంబంధించి కూడా కీలక సూచనలు చేసింది. అక్కడ ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరగనున్నట్లు స్పష్టం చేసింది.

Also Read: Revanth Reddy on KCR: కేసీఆర్.. ఒక్కరోజు కాదు.. చర్చకు రావాలి.. సీఎం రేవంత్ సెటైర్స్

మరి ఆంధ్రాలో ఎప్పుడు?

తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ పడింది. ఆంధ్రా (Andhra Pradesh)లోనూ గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఏపీలో వచ్చేవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Court Movie Review: కోర్ట్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
Telangana Assembly: సభలో ప్రశ్నల తూటాలు.. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు