Janhvi Kapoor
ఎంటర్‌టైన్మెంట్

Actress: డైరెక్టర్ కోసం మూడు రాత్రులు గడిపాను: స్టార్ హీరోయిన్

Actress: జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘ధడక్’ అనే హిందీ మూవీతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్, అంగ్రేజీ మీడియం, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. 2018లో సినీ కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ఇప్పటివరకు కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

అయితే వరుసగా మూవీస్ చేస్తున్నప్పటికి తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ఈ విషయంలో మాత్రం కొంచం డిస్సపాయింట్‌గానే ఉందంట ఈ భామ. ఇటీవల టాలీవుడ్‌కి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో జాన్వీ కొంచం సేపు కనిపించనప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ అందాల తారకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలతో నటీంచే ఛాన్స్ దక్కించుకుంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ మూవీ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్‌కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ కోసం మూడు రాత్రులు గడపాల్సి వచ్చిందని ఈ బ్యూటీ కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. అయితే 2021లో జాన్వీ ‘రూహి’ అనే చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం తాను కష్టపడ్డ విషయాలు వెల్లడించింది.

Also Read: ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్? ప్రేమ పాఠాలు అతనితోనే?

Janhvi Kapoor

అయితే ఈ చిత్రంలో ఓ పాట చిత్రీకరణ సమయంలో ఇబ్బందులు పడ్డానని చెప్పింది. ఆ సాంగ్‌లో తాను ఒక్కదాన్నే డ్యాన్స్ చెయ్యాల్సి వచ్చింది. సింగిల్‌గా పెర్ఫార్ చేయాలని డైరెక్టర్ చెప్పడంతో కొంచం కష్టం అనిపించిందట. అప్పుడు చిన్న వయస్సు కావడంతో డ్యాన్స్ చేయడం ఇబ్బందే అనిపించిందని చెప్పింది. అదే సమయంలో మరో సినిమాలో కూడా నటిస్తుందట. ఇక రెండు సినిమాలకు డేట్స్ ఇవ్వడం కష్టం అవ్వడంతో పగలు, రాత్రి కష్టపడాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘రూహి’ మూవీలో ఓ పాట కోసం మూడు రోజులు కష్టపడ్డానని చెప్పింది. వరుసగా మూడు రోజులు నిద్ర పోకుండా రాత్రి, పగలు రిహర్సిల్స్ చేసానని.. డైరెక్టర్ చెప్పడంతో నో అని చెప్పలేక మూడు రాత్రులు గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ జంటగా జాన్వీ కపూర్ ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరిగుతోంది. రామ్ చరణ్- జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఒక పాట కూడా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హిందీలో ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి’ అనే చిత్రంలో నటిస్తుంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఈ బ్యూటీ దూసుకెళ్తోంది.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?