Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘క’మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ‘దిల్ రూబా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 14న దిల్ రూబా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్స్‌పై విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్‌లో బిజీ అయిపోయింది. ఓ ఇంటర్వ్యూలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. దిల్‌రూబాకు సామ్ సీఎస్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని అన్నారు. సీఎస్ మ్యూజిక్ కోసమైనా ఈ మూవీ చూడాలని ఆడియన్స్‌కి సూచించారు. ఈ చిత్రంతో సారెగమా అసోసియేట్ కావడం హ్యాపీగా ఉందని తెలిపారు. తాను సినీ పరిశ్రమకు వచ్చి 5 ఏండ్లు అవుతుందని.. 10 మూవీస్ చేశానని వెల్లడించారు. తనపై మంచి ఆదరణ చూపిస్తున్నారని తెలిపారు. ఇదే ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా తెలిపారు.
తన తొలి చిత్రం విడుదల కాకముందే 10 మంది ఫ్యాన్స్ తన వెంట ఉండేవారని తెలిపారు. ఇప్పుడా 10 మంది వందలు, వేలు అయ్యారని తెలిపారు. తన అభిమానుల గురించి మాట్లాడాలంటే ఎమోషన్ అవుతానని అన్నారు. ఇదే అభిమానాన్ని కాపాడుకుంటూ గర్వపడేలా మూవీస్ చేస్తానని చెబుతున్నానని వెల్లడించారు. సినీ పరిశ్రమలోకి హోప్‌తో వచ్చే ఎంతోమంది ఇక్కడి కష్టాలు పడలేక తిరిగి రిటర్న్ వెళ్లడం చూశానని వెల్లడించారు.
ఇక అందరూ ధైర్యంగా ఉండండి.. తప్పకుండా జీవితంలో హ్యాపీగా ఉండే రోజు వస్తుందని అన్నారు. చిన్న చిన్న గ్రామాల నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చే వారికీ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని చెప్పాడు. అది ఫుడ్ కానీ, షెల్టర్ కానీ ఛాన్స్‌లు కానీయండి ..తన వల్ల చేతనైన సాయం వారికి చేస్తానని వెల్లడించారు. తాను ఫ్యూచర్ లో మరింత సక్సెస్ అయితే ఇంకాఎంతో మందికి హెల్ప్ చేస్తానని చెప్పారు. తన ప్రతి మూవీలో 40 – 50 మంది కొత్త వాళ్లకు ఛాన్స్‌లు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇకపైనా ఆ ప్రయత్నం కొనసాగిస్తానని తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!
తొలుత ‘దిల్ రూబా’ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డానని, ఇప్పుడు వస్తున్న ఆదరణ చూసి కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలిపారు. మార్చి 14న లేదా 13 సాయంత్రమే “ఈ మూవీ ప్రీమియర్స్‌తో తమ సక్సెస్ జర్నీ మొదలు కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోలీ సినిమా 2 గంటల 20 నిమిషాల్లో ఎక్కడా బోర్ కొట్టదని వెల్లడించారు. క మూవీలో కంటెంట్ చూశారని.. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరంను చూస్తారని చెప్పకొచ్చారు. ఈ మూవీలో డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు.