Vijayasai Reddy (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Vijayasai Reddy: జగన్ గురించి.. ఆ నిజం చెప్పేసిన సాయిరెడ్డి.. అదేంటంటే?

Vijaysai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ కార్యాలయానికి వెళ్లిన ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ కు దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు.

వారి వల్లే జగన్ తో గ్యాప్ ..
సీఐడీ విచారణ అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ (YS Jagan Mohan Reddy) పూర్తిగా మారిపోయారంటూ వ్యాఖ్యానించారు. కోటరి (జ్ఞానం లేని వ్యక్తులు) మాటల వల్ల అతడిలో మార్పు వచ్చినట్లు స్పష్టం చేశారు. మీ చుట్టూ ఉన్న వారి మాటలు వినొద్దని గతంలోనే జగన్ కు చెప్పానని సాయిరెడ్డి తెలిపారు. కోటరి వల్లే జగన్ కు దూరమైనట్లు స్పష్టం చేశారు.

జగన్ మాటల్లో నిజం లేదు
తాను ప్రలోభాలకు లొంగానంటూ గతంలో మాజీ సీఎం వై.ఎస్. జగన్ చేసిన వ్యాఖ్యలను తాజా ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిపారు. జగన్ తనను పార్టీలో ఉండాలని చెప్పినట్లు తెలిపారు. అయితే జగన్ మనసులో తాను లేనందును పార్టీ లో కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో తిరిగి వైసీపీ లో చేరే అవకాశం తేల్చి చెప్పారు.

‘నాకేం సంబంధం లేదు’
సీఐడీ విచారణ గురించిన మాట్లాడిన విజయసాయిరెడ్డి.. పోర్టుతో కేసులో కీలకంగా ఉన్న అరబిందో కంపెనీ గురించి ప్రశ్నలు సంధించినట్లు చెప్పారు. అయితే ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని సీఐడీ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. అరబిందో వ్యాపారాల్లో తానెప్పుడు జోక్యం చేసుకోలేదని అన్నారు. కేసులో బాధితుడిగా ఉన్న కేవీ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. ఆ సంస్థ యజమాని కేవీరావుతో ముఖపరిచయం తప్ప ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని పేర్కొన్నారు. అటు విక్రాంత్ రెడ్డి గురించి ప్రశ్నించగా.. సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తనకు తెలుసని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.

Also Read: CM Chandrababu: ‘తల్లి, చెల్లి సమస్య తీర్చుకో’.. జగన్ కు బాబు కౌంటర్

సీఐడీ విచారణ ఎందుకంటే
గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్, కాకినాడ సెజ్ లలో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు విజయసాయిరెడ్డిపై మోపబడ్డాయి. ఆయా సంస్థల యజమాని కేవీ రావు నుంచి వాటిని లాక్కున్నట్లు సీఐడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఇందులో విజయసాయిరెడ్డి ఏ2 కాగా, వై.వి. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించే తాజాగా సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?