Kartik Aaryan-Sreeleela (image source: canva)
ఎంటర్‌టైన్మెంట్

Kartik Aaryan-Sreeleela: డేటింగ్ వార్తలు నిజమేనా?.. హీరో తల్లి ఇలా హింట్ ఇచ్చిందేంటి?

Kartik Aaryan-Sreeleela: సినీ పరిశ్రమలో రూమర్స్ అనేవి కామన్ అయిపోయింది. కెరీర్ మొదలుపెట్టిన నుంచి నటులపై రూమర్స్ రావడం సర్వసాధారణం. ఇక ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ విషయంలో రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కడైనా హీరో, హీరోయిన్ బయట కనిపిస్తే చాలు ఇద్దరు మధ్య రిలేషన్ అంటకడుతుంటారు. ఇలాంటి రూమర్స్ బారిన పడిన నటులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇందులో కొన్ని నిజమైన్పటికీ.. మరికొందరు విషయాల్లో మాత్రం రూమర్స్‌గానే మిలిగిపోయాయి. అయితే ఇటీవల టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కూడా ఓ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కు నిజం చేస్తూ ఆ హీరో తల్లి హింట్ ఇచ్చింది.

ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత బ్యూటీకి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల జంటగా నటిస్తూ దూసుకెళ్తోంది. కేవలం నాలుగు ఏండ్లలో పదుల సంఖ్యలో మూవీస్ చేసింది. ఇక ‘పుష్ప-2’లో కిస్సిక్‌ సాంగ్‌తో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకుంది. ఈ బ్యూటీ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ యువ హీరో ఇబ్రహిమ్‌ అలీఖాన్‌ నటిస్తున్న ఓ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

అయితే ఇటీవల మరో అవకాశం బాలీవుడ్ నుంచి అందుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ అగ్ర హీరో కార్తిక్‌ ఆర్యన్‌ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ముందుగా ఈ మూవీలో త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా అనుకున్నారు. లాస్ట్ మినిట్‌లో తప్పించి శ్రీలీలను కంఫర్మ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆడియన్స్‌ని అలరించిన ఆషికి -1,2 సీక్వెల్‌గా ఆషికి-3గా రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Also Read: రీ ఎంట్రీకి రెడీ అయిన హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే‌?

Kartik Aaryan-Sreeleela

ఈ క్రమంలోనే హీరో కార్తిక్‌ ఆర్యన్‌‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ముంబై నగరంలో ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని టాక్ నడుస్తుంది. ఇంకా కార్తిక్‌ ఆర్యన్‌ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు కూడా శ్రీలీల అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఇదిలాఉండగా కార్తిక్‌ ఆర్యన్‌ తల్లి ‘ఐఫా’ ఈవెంట్స్‌లో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు కాబోయే కోడలు ఎలా ఉండాలో వివరించింది. డాక్టర్ అయిన అమ్మాయి తన ఇంటికి వస్తే బాగుంటుందని ఆమె తెలిపింది. తమ ఫ్యామిలీ కూడా కోరుకుంటుందని చెప్పుకొచ్చింది. అయితే శ్రీలీల హీరోయిన్‌గా రాణిస్తూనే.. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చదువుతోంది. కార్తిక్‌ – శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న వేళ హీరో తల్లి కామెంట్స్.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. కాగా, శ్రీలీలను ఉద్దేశించే హీరో తల్లి ఈ కామెంట్స్ చేశారని పలువురు భావిస్తున్నారు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?