viajyasai
ఆంధ్రప్రదేశ్

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు… మరో అరెస్టు తప్పదా?

Vijayasai Reddy: వైసీపీ(YCP) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కి సీఐడీ(CID) పోలీసులు నోటీసులు(Notice) జారీ చేశారు. కాకినాడ పోర్టు(Kakinada Port) వాటాల బదిలీ కేసులో సాయిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయనపై 506,384, 420,109,467,120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. విచారణ నిమిత్తం రేపు(మార్చి 12)న మంగళగిరిలో ఉన్న సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.

కాగా, వైసీపీ హయాంలో టీడీపీ(TDP) దివంగత నేత కోడెల శివప్రసాదరావు(Kodela Siva prasadarao)పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని వాటి వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని, ఆయనతో పాటు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోడెల… స్పీకర్ గా ఉన్నారు. అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన స్పీకర్ గా ఉండి అసెంబ్లీ ఫర్నిచర్ ను సొంత పనులకు ఉపయోగించుకున్నారంటూ కేసు నమోదు చేశారు. అలాగే మరికొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో మనస్థాపానికి గురైన కోడెల… ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. గత కొన్ని రోజులుగా బోరుగడ్డ సునీల్, వల్లభనేని వంశీ, పోసాని వంటి పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయసాయి రెడ్డికి కూడా సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఆయనకు కూడా అరెస్టు తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వైసీపీలో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీలో నెంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి… ఇటీవల అనుహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇదిలావుంటే… రేపు సాయిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి.

Also Read: 

Mohan Babu: హీరోయిన్ సౌందర్యను చంపించాడంటూ మోహన్ బాబుపై ఫిర్యాదు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు

 

 

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?