Mohan Babu
ఎంటర్‌టైన్మెంట్

Mohan Babu: హీరోయిన్ సౌందర్యను చంపించాడంటూ మోహన్ బాబుపై ఫిర్యాదు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు

 

Mohan Babu: మంచు కుటుంబానికి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు జరగడం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మంచు టౌన్‌షిప్ కోసమే గొడవలు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మంచు టౌన్ షిప్ ఉన్న భూమి హీరోయిన్‌ సౌందర్యదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా హీరోయిన్ సౌందర్యను మోహన్ బాబు చంపించాడంటూ ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు.. ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని కోరాడు. సినీ నటి సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని విక్రయించమని నటుడు మోహన్ బాబు అడగ్గా.. సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు. దీనిపై కక్షపెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి టీడీపీ పార్టీ ప్రచారానికి వస్తున్న ఆమెను సాక్షాలు దొరక్కుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న 6 ఎకరాల గెస్ట్‌హౌస్‌ని అక్రమంగా అనుభవిస్తున్నాడని తెలిపాడు. మంచు టౌన్‌లో ఉన్న ఆ గెస్ట్‌హౌస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరాడు. అంతేకాక మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్‌కి న్యాయం చేయాలని కోరాడు. అలాగే మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో చిట్టిమల్లు కోరారు.

ఇక హీరోయిన్ సౌందర్య ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. సావిత్రి తర్వాత తెలుగు చిత్రపరిశ్రమకు దొరికిన డెమండ్ అని తన గురించి గొప్పగా చెప్పేవారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలోనే వివాహం చేసుకుంది. మూవీస్ లో నటిస్తున్న సమయంలోనే కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే హెలికాఫ్ట్రర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అయితే సౌందర్య మరణించిన తర్వాత ఆస్తులను ఆమె పేరేంట్స్ తీసుకున్నారని.. ఆ ఆస్తులను మంచు ఫ్యామిలీ కొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఏరియాలో 6 ఎకరాల భూమిని మంచు మోహన్ బాబు కొన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ స్థలంలోనే మంచి మోహన్‌బాబు మంచి ఇల్లు కట్టుకున్నారని అన్నారు. మంచు టౌన్‌షిప్ పేరుతో ఉన్న ఆ ఇంట్లోనే మోహన్‌బాబు ఉంటున్నారు. అయితే ఈ ప్లేస్ నిజంగా సౌందర్య ఫ్యామిలీ దగ్గరి నుంచి కొన్నారా లేదా అనేది క్లారిటీ లేదు.

Also Read: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’

మరోవైపు సాయంత్రం అయితే జల్‌పల్లిలో ఉన్న ఆ ఇంటి దగ్గర ఓ ఆత్మ తిరుగుతోందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జల్‌పల్లి గ్రామస్థులు సైతం నిజంగా తిరుగుతోందని చెబుతున్నట్లు ప్రచారం జరిగింది. అందుకే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని పుకార్లు నడిచాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ ఆత్మ హీరోయిన్‌దే అంటూ భారీ ఎత్తున ప్రచారం నడించింది. అసలు ఆత్మ ఎందుకు ఉంటుందని కొంతమంది కొట్టిపారేసారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ