Gopichand Movie Opening
ఎంటర్‌టైన్మెంట్

Gopichand: హిట్స్ లేకపోతేనేం.. ఈ హీరో సుడి ఎలా ఉందంటే?

Gopichand New Movie Opening: హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతున్నా.. సినిమాల విషయంలో మాత్రం అస్సలు గ్యాప్ అనేది లేకుండా దూసుకెళుతున్నాడు. హిట్ సినిమా కోసం ఆయన చేయని ప్రయత్నాలు లేవు. ఆఖరికి శ్రీను వైట్లని నమ్ముకున్నా కూడా ఆయనకు హిట్ ఇవ్వలేకపోయాడు. వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తున్నా, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కొదవలేకుండా చూసుకుంటున్నా.. గోపీచంద్ సినిమాలు మాత్రం ఎక్కడో తేడా కొడుతూనే ఉన్నాయ్. ఫలితంగా ఆయనకు అందని ద్రాక్షగా హిట్ మారిపోయింది. మాములుగా మరో హీరో అయితే ఈ సరికే దుకాణం సర్దేసి వెళ్లిపోయేవాడు. కానీ గోపీచంద్, మాస్ హీరో. అందులోనూ ఆయన సినిమాలు ఫెయిల్ అవ్వవచ్చేమో కానీ, ఆయన ప్రయత్నంలో మాత్రం ఎక్కడా లోపం కనిపించకపోవడమే.. ఆయనకు ఇంకా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మరో సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- India Won: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భారత్.. సెలబ్రిటీల రియాక్షన్ చూశారా!

విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy Director) దర్శకత్వంలో ఈ మాచో స్టార్ హీరోగా ఓ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ ఫిల్మ్‌ను సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి చిత్ర కోర్ టీం, ప్రత్యేక అతిథులెందరో హాజరయ్యారు. IB 71 (స్కై బ్యాక్ డ్రాప్), ఘాజీ (వాటర్ బ్యాక్ డ్రాప్) అంతరిక్షం (స్పేస్ బ్యాక్ డ్రాప్) చిత్రాలతో విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. ఇప్పుడీ సినిమాతో సరికొత్త టెరిటరీలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాకు ఆయన ఫైర్ ఎలిమెంట్‌ని క్రియేటివ్‌గా ఎక్స్‌ఫ్లోర్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇండియన్ హిస్టరీలో ఎంతో కీలకమైన, అంతా మరచిపోయిన ఓ సంఘటనను ఆయన విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 7వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా.. ఎంతో ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని ఒక చారిత్రక సంఘటనని ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకురానుందని, భారతీయ వారసత్వం మరచిపోయిన అధ్యాయానికి జీవం పోస్తుందని మేకర్స్ గర్వంగా చెబుతున్నారు. ఇందులో గోపీచంద్ నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారని, ఆయన వెర్సటాలిటీ కచ్చితంగా ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మణికందన్ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా, పృథ్వీ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎన్నికైన సాంకేతిక నిపుణుల లిస్ట్‌లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:
Ananya Panday: బికినీలో.. ‘లైగర్’ బ్యూటీ కంట్రోల్ తప్పింది

Ram Gopal Varma: పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు? వర్మ సమాధానమిదే!

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే