TGPSC Group-1 Results: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామక మండలి (TGPSC) వీటిని రిలీజ్ చేసింది. గతంలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ TGPSC ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందవచ్చు. కాగా మంగళవారం (మార్చి 11) గ్రూప్-2 ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మార్కుల షీట్ భద్రం
గతేడాది నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెుత్తం 7 పేపర్లతో TGPSC పరీక్ష నిర్వహించింది. అందులో అభ్యర్థులు సాధించిన ఫలితాలను తాజాగా TGPSC అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 16 వరకు మార్కులను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును టీజీపీఎస్సీ కల్పించింది. రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ మార్కుల షీట్ ను భద్రంగా ఉంచుకోవాలని TGPSC అభ్యర్థులకు సూచించింది.
Also Read: IPL 2025: ‘ఐపీఎల్ లో అవి ఉండొద్దు’.. కేంద్రం సంచలన నిర్ణయం
రీకౌంటింగ్ కు వెసులుబాటు
తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ కు TGPSC అవకాశం కల్పించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సౌఖర్యం కేవలం ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలను మరోమారు టీజీపీఎస్సీ అందుబాటులోకి తీసుకురానుంది. ఆ తర్వాత నుంచి సెలక్ట్ అయిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవనుంది.