gbs
ఆంధ్రప్రదేశ్

GBS: ఏపీలో మరో జీబీఎస్ మరణం… గుంటూరులో మహిళ మృతి

GBS:  జీబీఎస్(Guillain-Barre syndrome) తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆంధ్రప్రదేశ్(AP) లో గత నెల వరుస మరణాలు చోటుచేసుకున్నాయి. అందులో మహిళలే(Women) ఎక్కువ మంది ఉండట విషాదం. తాజాగా మరో జీబీఎస్ మరణం(gbs death) నమోదైంది. గుంటూరు(Guntur) ప్రభుత్వ ఆస్పత్రిలో మరో మహిళ మృతి చెందింది.

గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) లక్షణాలతో నాలుగు రోజుల క్రితం సీతామహాలక్ష్మి అనే మహిళ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. అయితే మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని
వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) ​లో జీబీఎస్ లక్షణాలతో గతంలో ఒకరు మృతి చెందారు. గత ఫిబ్రవరి నెలలో ఈ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు.

ప్రస్తుతం ఈ వ్యాధి బారిన రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆస్పత్రులలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఇది అంటువ్యాధి కాదని భయబ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. అదే సమయంలో జీబీఎస్ రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

గతంలో వైరల్​ఇన్​ఫెక్షన్​(viral infection) సోకి తగ్గిన వారిలో కూడా ఇది కనిపిస్తుందన్నారు. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. వ్యాధిగ్రస్తులు వాడే ఇంజక్షన్​ ఖరీదైనదైనా వాటిని సరిపడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

కాగా, జీబీఎస్ అనేది నరాల వ్యాధి. చేతులు, కాళ్లు అకస్మాత్తుగా వాపు రావడం ఈ వ్యాధి లక్షణం. నరాలు ఒక్కసారిగా చచ్చుబడిపోవడం, తీవ్రమోతాదులో పక్షవాతం రావడం జరుగతుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనపడినా.. అంత ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు చేతులు అకస్మాత్తుగా చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే