pranay-case
తెలంగాణ

Pranay Amrutha case: ప్రణయ్ హత్య కేసు… ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు

Pranay Amrutha case: ప్రణయ్ హత్య కేసు(pranay murder case) సంబంధించి నల్లగొండ కోర్టు(Nalgonda court) సంచలన తీర్పు వెలవరించింది. ఈ కేసులో నిందితులకు జీవిత ఖైదును(Life sentence) విధిస్తూ తీర్పిచ్చింది. అయితే నిందితుల్లో ఏ2 ..(A-2) సుభాశ్ శర్మ(Subhash Sharma)కు మాత్రం ఉరిశిక్ష(Death sentence) విధించింది. మిగతా నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతిరావు(Maruthirao) ఏ11గా ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే 2020లో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ హత్య 2018లో జరుగగా ఏడేళ్ల తీర్పు వెలువడింది.

వేరే కులం వాణ్ని తన కూతురు పెళ్లి చేసుకోవడాన్ని జీర్టించుకోలేకపోయిన అమృత తండ్రి మారుతిరావు… సుపారీ ఇచ్చి ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ పరువు హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్ హత్య జరిగింది. నిందితుల్లో ఒకరైన అస్గర్ అలీకి మారుతిరావు సుపారి ఇచ్చి హత్య చేయ్యమని చెప్పాడు. అలీ మొత్తం ఏడుగురితో గ్యాంగ్ ఏర్పాటు చేసి ఈ హత్యకు ప్లాన్ చేశాడు. దీంతో నిందితులు పట్టపగలు అందరరూ చూస్తుండగానే ప్రణయ్ ను నరికేశారు. ఆ దృశ్యాలు సీపీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇక, ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు… ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి 2019లో నిందితులపై చార్జీషీటు దాఖలు చేశారు. దాదాపుగా ఐదేళ్లకు పైగా విచారణ కొనసాగిన ఈ కేసులో తాజాగా తుది తీర్పును కోర్టును వెలువరించింది.

నిందితులు వీళ్లే…

ప్రణయ్‌ హత్య కేసులో ఏ2 సుభాష్‌కుమార్‌శర్మ, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నజీమ్ లు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్‌ రాకపోవడంతో జైలులోనే ఉన్నాడు. అస్గర్‌ అలీ(Asgar Ali) వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.

Also Read:

GBS: ఏపీలో మరో జీబీఎస్ మరణం… గుంటూరులో మహిళ మృతి

AP Assembly: ‘ఆడుదాం ఆంధ్రాలో రూ.400 కోట్ల స్కామ్’.. రోజా అరెస్టు ఖాయమైందా?

 

 

 

 

 

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..