Borugadda: తన తల్లికి అనారోగ్యమంటూ నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్(Fake Medical certificate) సృష్టించి బెయిల్ తీసుకున్న వైసీపీ(YCP) నేత బోరుగడ్డ అనిల్(Borugadda Anil) కు సంబంధించి మరో వ్యవహారం బయటకు వచ్చింది. ఆయన రాజమండ్రి(Rajahmundry) జైలులో ఉన్న సమయంలోనే బెయిల్ కు సంబంధించిన స్కెచ్ వేశారని, బ్యారక్ నుంచి పార్టీ నేతలకు ఫోన్లు(Phone Calls) చేసి ప్లాను సిద్దం చేసి దాన్ని తర్వా త అమలు చేసినట్లు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత అరెస్టు అయిన వైసీపీ నేతల్లో బోరుగడ్డ ఒకరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబాలను దూషించారంటూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో భాగంగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ… అక్కడి నుంచే పార్టీ నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. జైలు నుంచి ఆయన పార్టీ నేత ఒకరికి ఫోన్ చేస్తే.. సదరు వ్యక్తి మరికొంత మందిని లైన్లోకి తీసుకొని అలా కాన్ఫరెన్సు(conference Calls)లో మాట్లాడేవాళ్లని వార్తలు వస్తున్నాయి. అక్కడే… ఈ నకిలీ సర్టిఫికెట్ కు సంబంధించిన స్కెచ్ వేశారని భావిస్తున్నారు. దీన్ని బట్టి జైలులో సిబ్బంది ఆయనకు పూర్తిగా సహకరించారని అర్థమవుతోంది. గతంలోనూ అరెస్టు చేసిన సమయంలో బోరుగడ్డకు పోలీసులు చేసిన సపర్యల గురించి అందరికి తెలిసిందే. ఆయనను కోర్టుకు తరలిస్తూ బిర్యానీ పెట్టించడం, పోలీస్ స్టేషన్లో ఆయనకు బెడ్ ఏర్పాటు చేయడం వివాదస్పదమయ్యాయి. ప్రస్తుతం రాజమండ్రి జైలులో కూడా ఆయనకు అధికారులు సహకరించారా… అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వారానికి మూడు సార్లు మాట్లాడొచ్చు కానీ…
రూల్ ప్రకారం… జైల్లో రిమాండు ఖైదీల(Remand Prisoner)కు వారానికి మూడుసార్లు ఫోన్లు మాట్లాడే అవకాశముంటుంది.కానీ షరతులు వర్తిస్తాయి. వారు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుంది. ఖైదీల సంభాషణలను అధికారులు వినడం… అనుమానాలు వుంటే అప్రమత్తమవడం అధికారుల పని. కానీ బోరుగడ్డ కేసులో కొంచెం లిబరల్ గా.. విశాల దృక్పథంతో జైలు సిబ్బంది వ్యవహరించినట్లు పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు బోరుగడ్డ మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయాన్ని కూడా పోలీసులు సీక్రేట్ గా ఉంచడం పైనా విమర్శలు వస్తున్నాయి.
కాల్ డేటా పరీశిలించనున్న పోలీసులు
బోరుగడ్డ అనిల్ కుమార్… జైలు రిజిస్టరులో తన సోదరి నెంబరు ఇచ్చారు. అయితే అదే నెంబరుకు ఫోన్ చేసేవారా లేక ఇతర నెంబర్లకు చేసేవాడా? కాన్ఫరెన్సులో ఏయే ఎవరెవరితో మాట్లాడారు? అనే విషయాన్ని కాల్ డేటా(CDR) ద్వారా పోలీసులు పరిశీలించనున్నారు.
అంతకుముందు, తన తల్లికి ఒంట్లో బాలేదని మధ్యంతర బెయిల్ పై విడుదలైన బోరుగడ్డ… కోర్టు చెప్పిన మేరకు ఫిబ్రవరి 28న లొంగిపోయాడు. కానీ మార్చి ఒకటో తారీఖున బెయిల్ పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు. ఎందుకంటే … అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి తాను ఒక్కడినే కొడుకునని, ఆమె మరికొన్ని రోజులు వైద్య సేవలు అవసరమని, కాబట్టి బెయిల్ పొడిగించాలని కోరారు. దానికి గుంటూరు లో ఓ కార్డియాలజిస్టు ఇచ్చినట్లుగా ఓ సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించాడు. అయితే ఆ సర్టిఫికెట్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వాదనతో అంగీకరించిన కోర్టు… ప్రస్తుతానికి బెయిల్ పొడిగిస్తాము… అదే సమయంలో ఆ సర్టిఫికెట్ గురించి ఎంక్వైరీ చేయండి… నకిలీ అని తేలితే చర్యలు తీసుకుంటాం అని చెప్పింది. అనంతరం దర్యాప్తులో అది నకిలీదని తేలింది. ఆ వ్యవహారమే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.