cm revanth reddy counters ex cm kcr, questions whether he know about seasons, in which season rains చలికాలంలో వర్షాలు పడుతాయా? కేసీఆర్ పాపాలతోనే కరువు: రేవంత్ రెడ్డి
CM Revanth reddy Tukkuguda Sentiment
Uncategorized

Revanth Reddy: చలికాలంలో వర్షాలు పడుతాయా?: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Telangana: మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పేరిట నిర్వహిస్తున్న యాత్రలు, ఆ కార్యక్రమంల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌజ్‌కే పరిమితం అయ్యాడని, పదేళ్ల తర్వాతైనా ఇప్పుడు పొలం బడుతున్నందుకు సంతోషం అని కామెంట్ చేశారు. కేసీఆర్‌కు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదా? చలి కాలంలో ఎక్కడైనా వర్షాలు పడుతాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు వస్తే అది కేసీఆర్ పాపాల వల్లే వస్తుందని అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలతో 2023లో వర్షాలు పడలేదని, అందుకే ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ పాపాలను కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తున్నాడని ఆరోపించారు.

రైతు ఆత్మహత్యలు జరిగాయని కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, 48 గంటల్లో వారి వివరాలు అందిస్తే ఎన్నికల కోడ్ ముగియగానే తాము ఆదుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పార్టీలు మారుతున్నారని, అందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెల్లని వెయ్యి రూపాయల నోటు అని అన్నారు. కేసీఆర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదని పేర్కొన్నారు.

ఆయన బిడ్డ జైలుకు వెళ్లినందుకు కేసీఆర్ పై తమకు సానుభూతి ఉన్నదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఏ ఉద్యమ కార్యక్రమం తీసుకున్నా వెంటనే అడ్డుకునేవారని, పోలీసు స్టేషన్‌కు తరలించేవారని గుర్తు చేశారు. కానీ, తాము అలా కాదని, తమ ప్రభుత్వం ప్రజాస్వామికంగా నడుస్తున్నదని వివరించారు. అందుకే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడాన్ని తాము అడ్డుకోవడం లేదని చెప్పారు. అంతేకాదు, ప్రజల వద్దకు వెళ్లడానికి కేసీఆర్‌కు తమ ప్రభుత్వమే ఏర్పాట్లు చేసిందని, భద్రతా విషయమై కూడా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ జనరేట్‌తో పెట్టుకున్నారని, నిజంగా అక్కడ కరెంట్ పోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరెంట్ కోతలు సాధారణమయ్యాయని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ తర్వాత విద్యుత్ అధికారులను తాను ఆరా తీయగా ఆ జిల్లాలో 30 సెకండ్లు కూడా కరెంట్ పోలేదని చెప్పారని వివరించారు. కేసీఆర్ జెనరేటర్ పెట్టుకుంటే ఆయన వెంట ఉన్నవారే ఎవరు పుల్లా పెట్టారో? ఎవరు మళ్లీ సరి చేశారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. ఆ జెనరేటర్‌లో ఎవరు పుల్ల పెట్టారో.. ఆ పార్టీలో ఎవరు కట్టె పెట్టారో అంటూ పంచ్‌లు వేశారు.

ఇక రైతులను ఉద్దరించినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని, 2018 ఎన్నికల సమయంలో వెంటనే రైతు బంధు డబ్బులు వేశారని, ఆ తర్వాత నాలుగు నెలల నుంచి పది నెలల గ్యాప్‌తో రైతు బంధు డబ్బులు వేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు నిండాయో లేదో ఏవేవో ఏకరువు పెడుతున్నారని మండిపడ్డారు. మొత్తం 69 లక్షల రైతులు ఉంటే ఇప్పటికే తాము 65 లక్షల రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు వేశామని తెలిపారు. మిగిలింది కేవలం 4 లక్షల రైతులేనని వివరించారు. వారికి కూడా ఈ నెలాఖరులోగా డబ్బులు వేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ. 1500 కోట్లు ఉన్నాయని, రైతులకు 100 కోట్ల సహాయం చేయవచ్చు కదా.. అని రేవంత్ రెడ్డి అన్నారు.

6న ఏఐసీసీ మ్యానిఫెస్టో

ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరవుతారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను, మేలును ఈ సభలో తెలుపుతామని వివరించారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి, కొత్త హామీలను ప్రారంభించలేమని చెప్పారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?