Howrah express: హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
howrah
ఆంధ్రప్రదేశ్

Howrah express: రెడ్ క్లాత్ ఊపుతూ రైలుకు ఎదురెళ్లి… వేల ప్రాణాలు కాపాడిన ఏపీ యువకుడు

Howrah express: హౌరా ఎక్స్ ప్రెస్(Howrah Express) కు ఆదివారం పెను ప్రమాదం తప్పింది(Narrow Escape). ఓ యువకుడి(Young Man) సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెద్ద గండం గడిచింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం  తప్పాయి. ఏపీలోని గూడూరు రైల్వే జంక్షన్(Gudur Railway Junction) సమీపంలోని అడవయ్య కాలనీ వద్ద రైలు పట్టాలు(Train Tracks) విరిగాయి. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించారు.  దాన్ని గమనించిన సునీల్(Sunil) వెంటనే ఆలోచనలో పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి తెలియజేయాలి… ఎలా తెలియజేయాలి అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో హౌరా ఎక్స్ ప్రెస్ ఆ మార్గంలో వేగంగా దూసుకొస్తోంది. అయినా… కంగారు పడకుండా సమయస్పూర్తితో వ్యవహరించాడు సునీల్. పట్టాలు విరిగిన సంగతి రైలు నడుపుతున్న లోకో పైలెట్ కు తెలిసేలా రెడ్ క్లాత్(Red Cloth) ఊపుతూ… ట్రైన్ కు ఎదురెళ్లాడు. అది గమనించిన  హౌరా ఎక్స్ ప్రెస్ లోకో పైలట్(Loco Pilot) రైలును నిలిపేశాడు. ఈ రకంగా వెంట్రుక వాసిలో పెనుప్రమాదం తప్పిపోయింది. దాంతో అందరూ ఊపిరి పోల్చుకున్నారు. అనంతరం, గూడూరు జంక్షన్ అధికారులకు(Railway Officials) సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేశారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో పలు రైళ్లు సుమారు గంటపాటు ఆలస్యంగా నడిచాయి.

ఈ సందర్భంగా సునీల్ చేసిన సాహాసాన్ని మెచ్చుకొని తీరాలి. ఇదే సీన్ రజనీకాంత్ నటించిన శివాజీ సిన్మాలో ఉంటుంది. హీరోయిన్ తనతో పెళ్లికి  ఒప్పుకోవడం లేదని తలైవా… రైళ్లు పట్టాల మీద నిరసన తెలుపుతుంటాడు. హీరోయిన్ పట్టించుకోదు. సరే.. వదిలేయ్ అని హీరో వెళ్లబోతుండగా… పట్టాల మధ్యలో కాలు విరుక్కుంటుంది. సరిగ్గా రైలు కూడా అప్పుడే వస్తుంటుంది. అప్పుడు స్పందించిన హీరోయిన్… తన ఎరుపు రంగు చున్నీని ఊపుతూ… రైలుకు ఎదురెళ్తుంది. ట్రైన్ ఆగిపోతుంది. అయితే అక్కడ హీరో స్వార్థం కోసం చేసిన పని… ఇక్కడ సునీల్ సామాన్యుల ప్రాణాల కోసం చేశాడు. అలాగే.. సినిమాలో చూపించడం వేరు.. నిజంగా చేయడం వేరు. ఆ సాహాసం చేసిన సునీల్ కు హాట్సాఫ్!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క