Bollywood
ఎంటర్‌టైన్మెంట్

Bollywood: యాడ్‌లో నటించిన బాలీవుడ్ నటులకు బిగ్‌షాక్.. నోటీసులు జారీ!

Bollywood: సినీ స్టార్స్ మూవీస్ చేస్తూ.. అటు యాడ్స్‌లో నటిస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఆ ప్రకటనల ద్వారా విమర్శలు ఎదర్కొన్న స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. అలాగే కేసుల పాలైన నటులు కూడా చాలా మందే. అయితే ఆ యాడ్ ప్రజలకు ఉపయోగకరమైందా? కాదా? అనేది అలోచించి కొందరు ముందుకు వెళ్తుంటారు. మరికొందరు మాత్రం గుడ్డిగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. ముందు వెనక ఆలోచించకుండా ప్రకటనలలో నటించి సమస్యల వలయంలో చిక్కుకుంటారు. తాజాగా ఓ యాడ్‌లో నటించిన బాలీవుడ్ హీరోలకు బిగ్ షాక్ తగిలింది. బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నారు. ఈ మేరకు షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, టైగర్‌ ష్రాఫ్‌లకు నోటీసులు జారీ చేశారు. ఈ పాన్ మసాలా తయారు చేసే జేబీ ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్ కుమార్ కు కూడా నోటీసులు అందజేశారు. మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కానీ యెడల చర్యలు తప్పవని హెచ్చరించింది. నోటీసు జారీ చేసిన రోజు నుండి 30 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని బడియాల్ కోర్టు కోరింది.

Also Read: రష్మికాకు అండగా నిలిచిన సీనియర్ నటిపై ట్రోల్స్

అయితే పాన్ మసాలాకు సంబంధించిన ఒక యాడ్ నటులు షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు చేశారు. పాన్ మసాలాలోని ప్రతి గింజకు కుంకుమపువ్వు శక్తి ఉంది అని ఆ ప్రకటనలో పేర్కొంటారు. అయితే హెల్త్‌కి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారని, సమాజాన్ని తప్పుదారి పట్టించేలా ఈ యాడ్ ఉందని జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ప్రకటన చూసి చాలా మంది జనం విపరీతంగా పాన్ మసాలాను తింటున్నారని ఆరోపించాడు. అంతేకాదు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతిథి యాడ్ లో చెబుతున్న విధంగా అందులో ఎలాంటి కుంకుమపువ్వు పదార్ధం మిశ్రమం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కుంకుమ పువ్వు ధర కిలోకు రూ.4 లక్షలు పలుకుతుందని, అదే పాన్ మసాలా కేవలం రూ.5లకే లభిస్తుందని వెల్లడించారు. పాన్‌ మసాలాలో కుంకుమ పువ్వు కలిపే ఛాన్స్ లేదని స్పష్టం చేసాడు. తప్పుడు ప్రచారం ప్రమోట్ చేసిన కంపెనీ యాజమాన్యంతో పాటు అందులో బాలీవుడ్ నటులు షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, టైగర్‌ ష్రాఫ్‌లులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇప్పుడు వీరు చేసిన ప్రకటన వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోవడంమే కాకుండా ప్రాణనస్టాన్ని కూడా ఎదురుకుంటున్నారనిఆరోపించాడు. ఈ పాన్ మసాలా తయారు చేసిన కంపెనీపై జరిమానా విధించడంతో పాటు ఆ పాన్ మసాలాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ విషయంపై షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు మాత్రం స్పందించలేదు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్