Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకరి మృతి, ఇద్దరి గల్లంతు
car-fell-srsp
Telangana News

Accident: కారు నడుపుతుండగా గుండెనొప్పి- కాల్వలోకి దూసుకెళ్లిన కారు! ఒకరి మృతి, ఇద్దరి గల్లంతు

Accident: ఎస్పారెస్పీ కాల్వలో(SRSP Canal)కి ప్రమాదవశాత్తు  కారు(Car) దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు(Missing). వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు నడుపుతుండగా వ్యక్తికి ఒక్కసారిగా గుండె నొప్పి(Heart Attack) రావడంతో అదుపుతప్పి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా.. తండ్రి, కుమార్తె గల్లంతయ్యారు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. వరంగల్‌(Warangal) జిల్లా సంగెం(Sangem) మండలం తీగరాజుపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు(Rescue) చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే… వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్‌ కుటుంబంతో కలిసి హనుమకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఆయనతో పాటు భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమారుడు ఆర్యవర్థన్ సాయి ఉన్నారు. అయితే మార్గమధ్యలో డ్రైవింగ్‌ చేస్తున్న ప్రవీణ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో కుమారుడు మృతి చెందగా.. కారుతో సహా ప్రవీణ్, చైత్ర సాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.స్థానికుల గమనించడంతో కృష్ణవేణి బతకగలిగింది. కాగా, నీటి ప్రవాహాన్ని తగ్గించి ప్రవీణ్‌, చైత్రసాయి ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read:

Jr Ntr fan Koushik Death: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ మృతి… అభిమానుల సంతాపం

 

 

 

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?