NTR Fan Kaushik
ఎంటర్‌టైన్మెంట్

Jr Ntr fan Koushik Death: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ మృతి… అభిమానుల సంతాపం

Jr Ntr fan Koushik Death: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్(Koushik) చనిపోయినట్లు తెలస్తోంది. తిరుపతికి చెందిన కౌశిక్ కొంతకాలంగా క్యాన్సర్(Cancer) తో బాధపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం… తన అభిమాన హీరోతో మాట్లాడాలని ఉంది అంటూ అతను కోరుకోవడంతో తారక్ ప్రత్యక్షంగా కలవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో… ఆయన కౌశిక్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడి అతన్ని పరామర్శించారు. ప్రస్తుతం అతను చనిపోయాడని తెలిసి ఏన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) షాక్ అయ్యారు. కౌశిక్ మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, తన నటనతో, డాన్సులతో విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తారక్ కు అభిమానులంటే ప్రాణం. సినిమా వేదికల మీద ఆయన ముందు అభిమానులనే స్మరిస్తుంటాడు. వాళ్లకు బాగోగులు చెప్తుంటాడు. క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని, సోదరుణ్ని కొల్పొయినందున..  ప్రతి ఆడియో ఫంక్షన్‌లో ఆయన అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటాడు. కాగా, ఈ విషాద వార్త పట్ల ఏన్టీఆర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Also Read: 

YS Viveka Case: వివేకా హత్య కేసు… రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

 

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!