Sakthi Teams: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు భరోసా కల్పించడంలో భాగంగా కొత్త శక్తి టీమ్స్ ను ప్రారంభించింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ ‘శక్తీ టీమ్స్’ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
శక్తి టీమ్ పని ఏంటంటే
మార్కాపురం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో భేటి అయ్యారు. ఈ క్రమంలోనే శక్తి టీమ్స్ ను సీఎం ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం ఈ టీమ్స్ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆలాగే స్త్రీలపై జరిగే నేరాలను నిరోధించి తక్షణ సాయం అందించడమే లక్ష్యంగా వీటిని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: Chiranjeevi: చిన్నప్పుడే ముగ్గురు తోబుట్టువులను కోల్పోయా: చిరంజీవి
స్త్రీల రక్షణకు సంస్కరణలు
మార్కాపురం కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని ప్రభుత్వం తరపున మహిళలకు భరోసా కల్పించే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని స్త్రీల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారులపై వేధింపులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. మహిళలను వేధించే వారు బయట తిరిగే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. 6 నెలల్లోగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.