Chiranjeevi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర చేరింది. మహిళ దినోత్సవం స్పెషల్‌గా మెగా ఫ్యామిలీ ఒక ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు నాగబాబు, అమ్మ అంజనాదేవి, చెల్లెళ్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫ్యామిలీ అంతా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తన చెల్లి చిన్నప్పుడు చనిపోయిన విషయం గుర్తు చేసుకుని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అయితే తన తల్లికి ఎనిమిది మంది సంతానం అని చెప్పాడు. తన తోబుట్టువులు ముగ్గురు చిన్నప్పుడే మరణించారని తెలిపాడు. తన తండ్రి ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఇంటిని మొత్తం అమ్మే చూసుకునేదని చిరంజీవి చెప్పాడు. ఒక గృహిణిగా అన్ని పనులు తన తల్లే చూసుకునేదని వెల్లడించాడు. అమ్మకు తోడుగా కొన్ని పనులు చేసేవాడినని పేర్కొన్నాడు. అయితే సిక్త్స్ క్లాస్ చదివే సమయంలో తన సోదరి మరణించిందని తెలిపాడు. తన చెల్లి పేరు రమ్య అని, అనారోగ్యానికి గురై చనిపోయిందని అన్నాడు. తన తల్లితో కలసి చెల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని తెలిపాడు. తన చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చానని, స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్వహించామని తెలిపాడు. ఈ విషయం తన తండ్రికి లేట్ గా తెలిసిందని, ఆయన వచ్చే సరికే కార్యక్రమం అయిపోయిందని, తన చెల్లిని చివరి చూపు కూడా తండ్రి చూడలేకపోయాడని తెలిపాడు. ఆ క్షణాలు ఇంకా గుర్తు ఉన్నాయని ఎమోషనల్ అయ్యాడు.
ఇక ఇంట్లో తన తమ్ముళ్లు, అక్కచెల్లెళ్ళ కంటే చలాకీగా ఉండేవాడినని తెలిపాడు. అయితే తాను మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి తన తల్లి ఎప్పుడూ చెబుతూ ఉండేదని అన్నాడు. ఒక రోజు ఇంట్లో నుంచి రోడ్డుపైకి వెళ్లానని, ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డుపైనే ఏడ్చుకుంటూ కూర్చున్నానని, అప్పుడే ఒక వ్యక్తి చూసి తన తల్లికి చెప్పాడని అన్నాడు. అయితే తన తల్లి అంజనాదేవి వచ్చే సరికి ఒళ్లంతా మసి పూసుకుని ఉన్నానని తెలిపాడు. తనను అంజనాదేవి గుర్తు పట్టలేదని పేర్కొన్నాడు. ఇతడు మా అబ్బాయి కాదని వెళ్లిపోయిందని, మళ్ళీ అనుమానం వచ్చి వెనక్కి వచ్చిందని ఆ తర్వాత గుర్తు పట్టిందని తెలిపాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చి తాళ్లతో కట్టేసిందని, అది ఇంకా ఇప్పటికీ గుర్తు ఉందని చెప్పుకొచ్చాడు.
Also Read: ఆస్తులు అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్.. కారమిదేనా!
ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. మెగాస్టార్ ఇటీవల నటించిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ఇందులో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో చిరు నటిస్తున్నారు. బింబిసార సినిమాతో డైరెక్టర్‌గా మొదటి హిట్ అందుకున్న వశిష్ట.. ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా ఆషికా రంగనాథ్‌ని సెలెక్ట్ చేశారు. అంజి తరువాత మెగాస్టార్ చేస్తున్న గ్రాఫిక్స్ మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.