Sivaji
ఎంటర్‌టైన్మెంట్

Sivaji: ఈ సినిమాలోని క్యారెక్టర్‌తో నాకు పెద్ద పేరు వస్తది: శివాజీ

Sivaji: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుసగా హిట్ మూవీస్‌తో పాటు ప్రోడ్యూసర్ గానూ రాణిస్తున్నాడు. తన వాల్ పోస్టర్స్ బ్యానర్‌పై విభిన్న కథలతో కూడిన చిత్రాలను అందిస్తున్నాడు. తాజాగా ‘కోర్ట్’ మూవీతో మరోసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీకి స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది క్యాప్షన్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ డైరెక్షన్ వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ మార్చి 14న హోలీ ఫెస్టివల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నాని, యాక్టర్ శివాజీ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నటుడు శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 13 ఏండ్ల తర్వాత చేసిన చిత్రం ఇది. వెండితెర మీద నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన నానికి థాంక్యూ. చాలా మూవీ ఛాన్స్‌లు వచ్చాయి కానీ అన్నిట్లో నాకు నచ్చింది ఈ సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్. ఫ్యామిలీ, ఎమోషన్ లేకుండా ఏ మూవీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఉంది. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా ముఖ్యం. చాలా మంచి చిత్రమిది. దర్శికి ఒక యూనిట్ స్టైల్ ఉంది. ఇందులో చేసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు. డాక్టర్ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన నుంచి ఎంతోమంది కొత్త దర్శకులు రావాలని, వారి బ్యానర్ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపాడు.

Also Read: ఆస్తులు అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్.. కారమిదేనా!

అనంతరం రామ్ జగదీష్ మాట్లాడుతూ.. ‘ఈ స్టేజ్ నాకు చాలా స్పెషల్. నా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా రైటింగ్ టీం డైరెక్షన్ టీంకి థాంక్యూ. వీళ్లంతా పేపర్ మీద సినిమా చూసిన మనుషులు. డీవోపీ దినేష్ లవ్ టుడే మహారాజా లాంటి 100 కోట్లు సినిమా తీసిన కెమెరామెన్. ఆయన మా కోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం లక్కీగా ఫీల్ అవుతున్నా. తన కెమెరాతో ఈ సినిమాకి జీవం పోశాడు. విజయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. విటల్ సహజంగా కనిపించే సెట్స్ వేశారు. ప్రశాంతి, దీప్తి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్ శ్రీదేవి ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్. దర్శి అన్నకి బలగం ముందు ఈ కథ చెప్పాను. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. నాని వన్ అండ్ ఓన్లీ. నాని ప్రోడక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక గొప్ప లెగసీ. ఆయన నమ్మిన విధానం అద్భుతం. అది చాలా బాధ్యత పెంచింది. 14 తారీకు ఆ నమ్మకాన్ని తిరిగి ఇచ్చేస్తాను. కోర్టు మన అందరికీ జీవితం. థియేటర్స్ కి రండి. ఆ రోజు మాట్లాడుకుందాం’ అని అన్నారు.

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?