credit-war-in-bjp
Politics

Telangana BJP: రద్దైన ‘బండి’ ర్యాలీ… బీజేపీలో క్రెడిట్ వార్ నడుస్తొందా?

Telangana BJP: ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) విజయం(victory)పై బీజేపీ(Telangana BJP)లో క్రెడిట్ వార్(Credit War) జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో(Graduate, Teacher MLC) బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ క్యాడర్‌(Cadre)లో జోష్ కనిపిస్తున్నది. ఈ విజయంపై పార్టీలోని ముఖ్య నేతల మధ్య అధిపత్య పోరు నడుస్తున్నట్టు సమాచారం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ రెండు స్థానాల్లో కమలదళం విజయం సాధించడంతో క్యాడర్‌లో జోష్ పెరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Minister Bandi Sanjay) శనివారం విజయోత్సవ ర్యాలీ(Success Rally) నిర్వహించాలని భావించారు. దాదాపు 50 వేల మందితో సభను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. ముఖ్య అతిథిగా స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy)ని ఆహ్వానించారు. కానీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన గంటల వ్యవధిలోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయంతో జోష్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలదళం మూడింట రెండు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. మండలిలో తమ బలాన్ని ఒక్క స్థానం నుంచి మూడు స్థానాలకు పెంచుకున్నది. ఇదే జోష్ తో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలవడంతో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం పలువురు నేతలు దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎవరికి వారుగా ఈ క్రెడిట్ తమదేనంటూ తమదేనని చెప్పుకునే పనిలో పడినట్టు పార్టీలో పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. చట్టసభల్లో పార్టీ బలం పెరుగుతుండటంతో ఎవరికి వారుగా ప్రాధాన్యం పెంచుకోవడంపై దృష్టిసారిస్తున్నారు. భవిష్యత్ కు ఏదో ఒక సమయంలో ఈ క్రెడిట్స్ పనికొస్తాయని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే సమన్వయ లేమితో సతమతమవుతున్న పార్టీలో ఎవరికి వారుగా ప్రాధాన్యం పెంచుకోవడంతో వర్గపోరు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

నేడు రాష్ట్రానికి బన్సల్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్(State in charge) సునీల్ బన్సల్(Sunil Bansal) శనివారం రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆయన సమావేశమవ్వనున్నారు. ఈ కీలక మీటింగ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, సమన్వయం తదితర అంశాలను సైతం టచ్ చేసే అవకాశముంది. ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై చర్చించే చాన్స్ ఉంది. ఓటమికి గల కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(State President) ఎంపికపైనా పలువురు నేతల అభిప్రాయ సేకరణ చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. అలాగే భవిష్యత్ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా కార్యాచరణ ఫిక్స్‌ చేసుకునే అవకాశాలున్నాయి. వాజపేయి(Vajpayee) శత జయంతి ఉత్సవాల(Centenary Celebrations)పైనా చర్చించే అవకాశాలున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైనా సమావేశమయ్యే చాన్స్ ఉంది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?