Roja Selvamani
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది!

Tollywood: రోజా సెల్వమణి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటిగా, రాజకీయ నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందింది రోజా. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ఎదిగిన ఆమె.. రాజకీయాల్లోనూ చక్రం తిప్పింది. ఇప్పటికీ అటు సినిమాల్లో నటిస్తూ.. రాజకీయంగా కూడా రాణిస్తుంది. అసలు రోజా బ్యాక్ గ్రౌండ్ ఏంటి?.. ఆమెకు ఇష్టం లేకున్నా సినిమాల్లోకి ఎలా వచ్చింది?.. రాజకీయాల్లోకి సడెన్‌గా ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజురెడ్డి, లలిత దంపతులకు 1972 నవంబరు 17న జన్మించింది. రోజాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. నాగరాజురెడ్డి హైదరాబాద్‌లోనే ఉంటూ సారథి స్టూడియోలో పనిచేసే వారు. రోజా మాత్రం డిగ్రీ వరకు తిరుపతిలోనే చదివింది. పద్మావతి మహిళా యూనివర్శిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. రోజా డిగ్రీ చదువుతున్న సమయంలో మాజీ టీడీపీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ ‘ప్రేమ తపస్సు’ అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తుండగా.. హీరోయిన్ కోసం చూస్తున్న క్రమంలో రోజా తండ్రి నాగరాజురెడ్డిని మీ అమ్మాయికి సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాడు. ఇక తనని అడిగి చెపుతా అని చెప్పాడట. అప్పుడు రోజా తనకు సినిమాలోకి వెళ్లాలని లేదు అని తండ్రికి చెప్పిందట. ఇక ఎలాగైనా నాగరాజురెడ్డి రోజాను ‘ప్రేమ తపస్సు’ లో హీరోయిన్‌గా చేయమని బతిమాలడంతో ఓకే చెప్పిందట. ఆ తర్వాత రోజా భర్త, తమిళ దర్శకుడు ఆర్. కె. సెల్వమణి చిత్రంలో అవకాశం వచ్చింది. ‘చెంబరుతి’ అనే మూవీలో యాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే ఇటు తెలుగు, అటు తమిళంలో రెండు చిత్రాలు హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

roja

Also Read: స్పెషల్ సాంగ్‌లో కేతికా.. గ్లామర్ బ్యూటీకి కలిసొచ్చేనా?

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ దూసుకెళ్లింది. అప్పట్లో స్టార్ హీరోస్ అందరితో నటించింది. చామంతి, బొబ్బిలి సింహం, ముఠా మేస్త్రి, శుభలగ్నం,పోలీస్ బ్రదర్స్, అన్నమయ్య, సమ్మక్క-సారక్క ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. 100కు పైగా సినిమాల్లో నటించి రోజా ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. 2002లో తిరుపతి శ్రీనివాసుడు సన్నిధిలో డైరెక్టర్ సెల్వమనిని రోజా పెళ్లి చేసుకుంది. ఇక, తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్..1999లో తిరుపతి ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తరుపున ప్రచారం నిర్వహించామని అడిగాడు. దీంతో శివప్రసాద్ కు మద్దతుగా రోజా ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆమెకు పరిచయం అయ్యాడు. రోజాను మీ లాంటి వారి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పి.. 2004లో నగిరి నుంచి టికెట్ ఇచ్చాడు. అయితే ఆమె గెలుపొందలేదు. ఆ తర్వాత వైసీపీ పార్టీ చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేసారు. ప్రస్తుతం రాజకీయాలు చేస్తూ..అప్పుడపుడు టీవీ షోస్ ల్లో కనిపిస్తున్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?