CM Revanth: తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన టీచర్ (Teacher MLC), గ్రాడ్యుయేట్(Graduate MLC) ఎమ్మెల్సీ ఫలితాల్లో కాంగ్రెస్(Congress) కు అనుకూలంగా రిజల్ట్స్(Results) రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC Elections) ఎన్నికలు ముంచుకు వస్తుండటంతో పార్టీ వాటికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. మార్చి నెలలోనే ఖాళీ కాబోయే ఐదు స్థానాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనే దాని మీద సీఎం అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆ పనిమీద ఓ సారి ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ (CM Revanth)… శుక్రవారం మరోసారి వెళ్తున్నారు. ఇంకోవైపు పార్టీ లైన్ దాటడని సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) బీసీ ఉద్యమాన్ని(BC Movement) పెద్ద ఎత్తున కొనసాగిస్తామని శపథం చేశారు. అదే సమయంలో కులగణన(Cast Census) విషయంలో ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఇక, ఇటీవలే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan) తొలిసారి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి నేతలకు కీలక ఆదేశాలు జారీ చేయడం. ఇవన్నీ పరిణామాలు చకచకా గ్యాప్ లేకుండా జరుగుతున్నాయి. దానికి మీనాక్షీ మేడం రాక ఒక కారణమైతే, ఆ సందర్బంగా పార్టీ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా కారణంగా స్పష్టంగా అర్థమవుతోంది. అవి గాక ఎమ్మెల్సీ ఎన్నికలు. మొన్నటి వరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారంలో బీజీగా తిరిగిన సీఎం, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండెట్ సెలక్షన్ కు సంబంధించిన పనిలో తలమునకలై ఉన్నారు. మొత్తానికి కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి… పాలనపరమైన అంశాల కంటే రాజకీయపరమైన, పార్టీ పరమైన అంశాలకే అనివార్యంగా ప్రాధాన్యం ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.
విడివిడిగా జరుగుతున్నా వడివడిగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల మధ్య తాజాగా మరో పరిణామం జరిగింది. సీఎం రేవంత్ సీనియర్ నేత జానారెడ్డి(Janareddy)ని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆయనతో అరగంట సేపు భేటీ అయ్యారు. నిన్న రాత్రే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు వెలవడటం, మరోవైపు ఇవాళ కేబినెట్ మీటింగ్ జరగనుండటంతో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. ఇదిలావుంటే… కుల గణన విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పార్టీ వ్యతిరేక పాల్పడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వారం రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, కుల గణన సర్వే వివరాలను ప్రభుత్వ బయటపెట్టిన నాటి నుంచే ఆరోపణలు చేస్తున్న మల్లన్న…రేవంత్ రెడ్డిని మాత్రం ప్రత్యక్షంగా విమర్శించలేదు. కానీ జానారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే చాలా రోజులుగా తనను అన్నెసి మాటలంటున్న సరే.. బీష్మ పీతామహుడు లాంటి జానారెడ్డి మల్లన్న వ్యాఖ్యలపై స్పందించలేదు. కానీ బుధవారం స్పందించారు. తనను ఏమన్నా తాను పట్టించుకోనని కానీ పార్టీ నేతలు ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం బాధించిదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ తరుణంలో జానారెడ్డిని రేవంత్ కలవడం ఇంట్రెస్టింగ్ అంశం. కాబట్టి వారిద్దరు భేటిలో భాగంగా ఏం చర్చించి ఉంటారు? ఏం వ్యూహాలు రచించి ఉంటారు? ఎవరికైనా చెక్ పెట్టబోతున్నారా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్.