Ys Viveka Case: మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి(Ys Vivekananda Reddy) హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన రంగన్న(70) (Ranganna) బుధవారం మరణించారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతోనే చనిపోయాడని ముందు అందరూ భావించారు. అయితే తాజాగా రంగన్న మృతిపై అనుమానాలున్నాయి అంటూ ఆయన భార్య సుశీల పులివెందుల(Pulivendula) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేసిన రంగన్న… ఆయన హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి(Key Witness). సీబీఐ(CBI) అధికారులు సైతం పలుమార్లు రంగన్నను ప్రశ్నించి అతని స్టేట్మెంటును రికార్డు చేసుకున్నారు. ప్రస్తుతం రంగన్న మృతి పెద్ద దుమారాన్నే రేపుతోంది. అతనిది సహజ మరణమా? కాదా అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి. ఆయన భార్య కూడా అదే ఆరోపణ చేయడంతో ఆ అనుమనాలకు బలం చేకూరుతోంది.
రంగన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన భర్త ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్నారని అతని భార్య సుశీల తెలిపారు. కాగా, రంగన్న రెండు వారాల కిందట కిందపడటంతో కాలికి గాయమైందని, అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉండటం, ఇతను ప్రధాన సాక్షి అయి ఉండటం చేత రక్షణగా ఓ కానిస్టేబుల్ ఉంటున్నాడు. అయితే, బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి తనకు ఊపిరాడటం లేదని రంగన్న చెప్పడంతో కుటుంబ సభ్యులు, అక్కడే రక్షణగా ఉన్న కానిస్టేబుల్ కడప రిమ్స్(RIMS) కు తరలించారు. చికిత్స పొందుతూ రంగన్న ఆ రోజు సాయంత్రమే మృతిచెందారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కడప రిమ్స్ కు సీబీఐ
మరోవైపు కడప రిమ్స్ ఆస్పత్రికి గురువారం చేరుకున్నారు. వివేకా హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆకస్మాత్తుగా మరణించినందున దానిపై అధికారలు ఆరా తీస్తున్నారు. రంగన్న పోస్టుమార్టం రిపోర్టును సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు సాక్షులు మరణించారు. ఇప్పడు రంగన్న కూడా చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక మతలబు ఏదైనా ఉందా అనేది దర్యాప్తులో తేలనుంది.