posani-relief
ఆంధ్రప్రదేశ్

Posani: రిలీఫ్ దొరికింది రాజా!… ఏపీ హైకోర్టులో పోసానికి భారీ ఊరట

Posani: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)కి ఏపీ(AP) హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుల(Complaints) మేరకు పలు పోలీసుస్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ.. పోసాని బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. పోసాని పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం…విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Also Read:

Ys Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో ముఖ్య సాక్షి మృతి

AP Politics: ‘హోదా హోరి’…. ప్రతిపక్ష హోదాపై కూటమి వర్సెస్ వైసీపీ

ఫిబ్రవరి 26న పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా (Annamyya District) పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం రిమాండ్‌(Remand) మీద ఆయనను రాజంపేట సబ్‌ జైలుకు తరలించారు. కాగా, పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్‌ సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌ మీద తరలించారు.

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..