Yashmi Gowda
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

Bigg Boss: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో‌ బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 8 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ బిగ్‌బాస్ షో.. త్వరలో 9వ సీజన్‌ మొదలుకానుంది. అయితే గతంలో ఈ షోకి వచ్చి ఫేమస్ అయిన వారు ఎందరో ఉన్నారు. ఒక్కసారైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే వారు చాలా మందే ఉంటారు. ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు.. అదే లైఫ్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనుకునే వారు కూడా ఉన్నారు. ఇక ఈ ‘షో’ కి కంటెస్టెంట్‌గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. తన అందం, అభినయంతో సీజన్‌-8లో అలరించిన యష్మీ కూడా ఒకరు. సీరియల్స్‌తో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో మరింత క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇక హౌస్‌లోకి మెయిన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లోనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ, 12వ వారంలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి యష్మీ బయటికి వచ్చేసింది. హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఈ బ్యూటీ సందడి చేసింది. అన్ని టాస్క్‌లు అద్భుతంగా ఆడుతూ.. ఆడియన్స్ మైమరిపించింది. తన బ్యూటీతో యువతను ఆకర్షించింది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌ల్లో యష్మీ ఒకరు. వారానికి రూ. 2.50లక్షల వరకు పారితోషికం తీసుకుందని తెలిసింది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చి పలు టీవీ షోస్‌లో పాల్గొంటూ.. సీరియల్స్‌లో నటిస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురులా యష్మీ ముస్తాబైన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముఖానికి పసుపు, మంగళ స్నానం చేస్తూ ప్రత్యక్షమైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో నెటిజన్లు పలు కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడే సడన్ గా పెళ్లి చేసుకుంటుందా ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Yashmi Gowda

Also Read: స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్

అయితే ఈ వీడియో నిజం కాదని తెలుస్తుంది. ఇది రియల్ కాదని, రీల్ వీడియో అని అంటున్నారు. ఓ సీరియల్ షూటింగ్‌లో భాగంగా యష్మీని పెళ్లి కూతురులా ముస్తాబు చేశారని తెలుస్తుంది. ఒక్కసారిగా పెళ్లి కూతురు గెటప్ లో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇది నిజం కాదని తెలిసి రిలీఫ్ అయ్యారు. ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా ఎంతో మంది కుర్రకారుల మనస్సు దోచుకున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో నిఖిల్‌తో లవ్ ట్రాక్ నడిపినప్పటికీ చివరికి అసలు విషయం తెలుసుకుని బ్రేకప్ చెప్పింది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?