Meenakshi
Politics

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్.. ది ట్రబుల్ షూటర్

ఆమె ఎంట్రీతో వేగంగా మారుతున్న పరిణామాలు
హస్తం నేతలు తీరు మార్చుకునే టైమ్ వచ్చిందా?
లైన్ దాటొద్దని ఇప్పటికే వార్నింగ్
సూటిగా సుత్తి లేకుండా ఫుల్ క్లారిటీ
కానీ, సాధ్యాసాధ్యాలపై రకరకాల చర్చలు

Meenakshi Natarajan: కాంగ్రెస్(Congress) పార్టీ.. దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ(Grand old Party). అటు జనంలో, ఇటు రాజకీయ క్షేత్రంలో గ్రౌండ్ లెవెల్‌లో బలంగా ఉంది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, పొలిటికల్‌(Political)గా ఎన్ని కుదుపులొచ్చినా తట్టుకొని నిలబడగలుగుతుంది. నాయకుల మధ్య ఎన్ని వివాదాలొచ్చినా, ఎన్ని విభేదాలు తలెత్తినా దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ గట్టిగా నిలబడిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న తాజా పరిణామాలు మాత్రం కాస్త భిన్నంగానే ఉన్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నాయకులకు, ఎప్పట్నుంచో పార్టీని అట్టిపెట్టుకొని ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల(Leaders)కు మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, ఎప్పుడైతే కొత్త ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఢిల్లీ(Delhi) నుంచి దిగారో అప్పట్నుంచి పార్టీలో పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి.

పార్టీ లైన్ దాటితే వేటే

మీనాక్షి ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోవాల్సిన టైమొచ్చిందనే చర్చ మొదలైంది. గ్లామరస్ రాజకీయాలు(Glamourous Politics) పనికిరావని, పైరవీలు తన దగ్గర అసలే నడవవని ఆమె క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. పార్టీ లైన్(Party Line) దాటితే, వేటు(Suspension) తప్పదని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా, సొంత పార్టీ నేతల్ని విమర్శించొద్దని సూచించారు. అంతర్గత విషయాలు ఏమున్నా మీటింగ్‌లోనే చెప్పాలని, గాంధీభవన్ బయట మాట్లాడొద్దని హెచ్చరించారు. చివరికి మంత్రులు తప్పొప్పులు చేసినా మీటింగ్‌లోనే చెప్పాలన్నారు. అంతేగానీ, మీటింగులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం లాంటివి వద్దని ఖరాఖండిగా చెప్పేశారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని సూటిగా హింట్ ఇచ్చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారు, కష్టపడిన వారి వివరాలను తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలని, వారి వల్ల సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని ఖరాఖండిగా చెప్పేశారు.

కాంగ్రెస్‌లో ఇది సాధ్యమవుతుందా?

పార్టీని, నాయకులని సెట్ రైట్ చేసే విషయంలో మీనాక్షి క్లియర్‌గానే ఉన్నారు. ఎలాంటి విషయమైనా తనతో చెప్పాలంటున్నారు. ఏమున్నా మీటింగ్‌లోనే చెప్పమంటున్నారు. కానీ, కాంగ్రెస్‌లో ఇది సాధ్యమవుతుందా? అనేదే బిగ్ క్వశ్చన్. పైగా, పదేళ్లు పార్టీలో ఉన్నోళ్లకే నామినేటెడ్ పోస్టులంటున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల లాంటి పదవులు కావాలంటే, పార్టీలో పదేండ్లు పనిచేసి ఉండాలని తేల్చేశారు. దీనిని గనక ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా అది గొప్ప విషయమే. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు, నిఖార్సైన కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరుగుతుంది. కానీ, అమలు చేయడం సాధ్యమవుతుందా లేదా? అనేదే అసలు పాయింట్. కొత్తగా బయట నుంచి పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీ పదవులు ఉండవని, సీనియర్లకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసేశారు. అంతేకాదు, నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా, కాంగ్రెస్ లాంటి పార్టీలో ఆచరణలో సాధ్యమవుతుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే, మిగతా పార్టీలతో పోలిస్తే, హస్తం పార్టీలో నాయకులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎక్కువ. ఎవరైనా మాట్లాడొచ్చు. ఎంతైనా మాట్లాడొచ్చు. మరి, మీనాక్షి నటరాజన్ విధానాలని ఎంతమంది పాటిస్తారు? ఎంతమంది ఒప్పుకుంటారు అనేది ఆసక్తి రేపుతున్నది.

ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు నష్టపోకుండా..

వాస్తవానికి, ఏ పార్టీ అయినా కార్యకర్తల్ని కాపాడుకోవాలి. పార్టీ కోసం కష్టపడినోళ్లని దగ్గరకు తీయాలి. వారికి తగిన గుర్తింపునివ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్‌లో అలాంటి కార్యకర్తలు వేల మంది ఉన్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఏమీ ఆశించకుండా పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేసిన వారున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు న్యాయం చేయాలి. అధికారంలోకి వచ్చేశాం, ఇక మా పనైపోయిందనే ధోరణిలో నాయకులుండొద్దు. కార్యకర్తల్ని గాలికి వదిలేయకుండా, జెండాలు మోసేందుకే అన్నట్లుగా చూడకుండా ఏదో రకంగా న్యాయం చేయాలి. ఎందుకంటే, ఏళ్లుగా కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉండే నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉంటారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఎన్నికల ముందు పార్టీలో చేరిన నాయకులకు, వారి అనుచరులకు పదవులిస్తే, పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా అది పార్టీలో చీలికలు తెస్తుంది. దీర్ఘకాలంలో రాజకీయంగా నష్టం చేస్తుందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు, మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్‌గానే ఉన్నారు. కార్యకర్తల్ని పార్టీ కోసం ఎలా వాడుకోవాలో తమకు తెలుసంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొని పోయి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెబుతున్నారు. కానీ, చాలా చోట్ల కొందరు నాయకులు ఓ వర్గానికి, ఇంకొందరు నాయకులు మరో వర్గానికి కాపు కాస్తున్నారు. దాంతో స్వపక్షంలోనే విపక్షంలా పరిస్థితులు తయారయ్యాయి. వీటిని చక్కబెట్టే పనిలోనే మీనాక్షి బిజీగా ఉన్నారు.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్