Agent OTT: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. అఖిల్ సరసన సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ రిలీజై 23 నెలలు అవుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించినప్పటికీ పోస్ట్‌ఫోన్ చేస్తూ వచ్చారు. దీంతో అఖిల్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా అఖిల్ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా వెల్లడించారు. మార్చి 14 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. దీంతో సినీ ప్రియులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అఖిల్ కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 మూవీ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ ఘోరమైన నష్టాలు మిగిల్చిందని అప్పట్లో టాక్ నడిచింది. ఓవరాల్ తెలుగు సినిమాల్లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా ‘ఏజెంట్’ నిలిచింది. ఇక ఈ మూవీలో డినో మోరియా, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ తదితరులు నటించారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన స్టోరీకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి మూవీకి స్క్రీన్‌ప్లేను కూడా రచించారు. ఇక మూవీ తర్వాత సురేందర్ రెడ్డి మళ్ళీ కనిపించలేదు. ఇక ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ అక్కినేని సినిమాలు కూడా థియేటర్లలోకి ఏమి రాలేదు.
Also Read: ఒకప్పుడు డెంటిస్ట్.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్!
మరోవైపు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం స్వయంగా అక్కినేని నాగార్జున వెల్లడించడం విశేషం. త్వరలోనే అఖిల్, జైనాబ్ ల వివాహం జరగనుంది. జైనాబ్ హైదరాబాద్‌లో జన్మించినప్పటికీ ఢిల్లీ, దుబాయ్, ముంబైలోనే పెరిగింది. జైనాబ్ ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. కాగా అఖిల్‌తో నిశ్చితార్థం అయిన వెంటనే జైనాబ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ప్రైవేట్‌గా మార్చేసిందట. ఆమె ఫొటోలు బయటికి రాకుండా ప్రైవేట్‌గా మార్చిందని అన్నారు. ఇక అఖిల్, జైనాబ్ మధ్య సుమారు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం అఖిల్ వయసు 30 కాగా.. జైనాబ్ కు 39 ఏండ్లు అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.