Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేశావే’ అనే చిత్రంతో 2010లో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంతో ఎంతో మంది కుర్రకారుల మనస్సు దోచుకుంది. ఈ ఫస్ట్ మూవీతోనే మంచి హిట్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ఆటోనగర్ సూర్య, మనం, ఓ బేబీ వంటి సూపర్ హిట్స్ మూవీస్ లోన్ నటించింది. తెలుగులో అందరూ స్టార్ హీరోస్ తో యాక్ట్ చేసింది. ఇక 2017లో ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య, సమంత జంట.. ఆ తరువాత 2021లో పర్సనల్ కారణాలతో డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఎవరి దారిన వారు చూసుకున్నారు. సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఆ తర్వాత సమంత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే విడాకుల తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఎన్నో ఛాన్స్‌లు వచ్చిన అన్నింటిని రిజెక్ట్ చేసింది. టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పిందని ప్రచారం కూడా నడించింది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన 15 ఏళ్ల సినీ కెరీర్ గుర్తుచేసుకుంది. ఈ పదిహేను ఏళ్లలో ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని తెలిపింది. మరోన్నో బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉన్నాయని పేర్కొంది. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. ఏ మాయ చేసావే అనే మూవీ తనకు స్పెషల్ అని చెప్పింది. తన కెరీర్ మార్చేసిన చిత్రంగా పేర్కొంది. ఆ మూవీలో చేసిన ప్రతి సీన్స్ ఇప్పటికీ గుర్తు ఉన్నాయని వెల్లడించింది. తన లైఫ్ లో ప్రతిదీ ఎక్స్‌పీరియెన్స్ అని, బలమేంటి.. బలహీనతలేంటి అనేది అర్థమైందని చెప్పుకొచ్చింది. గతం గుర్తు చేసుకుంటూ ఈ భామ ఎమోషనల్ అయ్యారు.
Also Read: ఒకప్పుడు డెంటిస్ట్.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్!
మరోవైపు ఈ క్యూటీ టాలీవుడ్ సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తానంటూ ఇటీవల అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే నాగచైతన్యతో సమంత బ్రేకప్ నుంచి తెలుగు సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ కెరీర్ ముందుకు సాగిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ.. మంచి స్టోరీస్ వస్తే తప్పకుండా తెలుగు మూవీస్‌లో యాక్ట్ చేస్తానని చెప్పింది. మంచి సినిమాలను అసలు వదులుకోను అని వెల్లడించింది. చాలా ఏళ్ల తరువాత మళ్ళీ టాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు సమంత ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.