జగన్ తప్పుడు ప్రకటనలంటూ స్పీకర్ ఫైర్
అయ్యన్న వ్యాఖ్యలు వ్యాఖ్యలు సరికాదన్న కోన
ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా హోదానా?
వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం
AP Politics: ప్రతిపక్ష హోదా(Opposition Status) పై మరోసారి అసెంబ్లీ(Assembly)లో వాడీవేడిగా చర్చ(Heated debate) జరిగింది. బుధవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ (Speaker) అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) మాట్లాడుతూ… నిరాధార ఆరోపణలతో వైసీపీ(Ycp) ఎమ్మెల్యే జగన్(Ys Jagan) తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని, న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూస్తున్నట్లు చెప్పారు. ‘‘ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యా బలం ఉండాలని చట్టం స్పష్టంగా చెప్తుంది. 175 మంది సభ్యులున్న సభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు కదా? అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుంది? దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు కదా? అని’’ స్పీకర్ వివరించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి కూడా జగన్ సహా ఆ పార్టీ సభ్యులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, అలా చేయడం సభా వ్యవహారాల ఉల్లంఘన కింద వస్తాయని పేర్కొన్నారు. కనీసం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారని, ఇంత చేసినా సభాపతి హోదాలో జగన్ ను క్షమించి వదిలేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
ఇదేం పద్ధతి..?
వైఎస్ జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్(Nar Lokesh) వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ఎన్నికల ముందు 175 సీట్లు వారివే అన్నారని, కానీ ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికి తెలుసునన్నారు. జగన్… వన్ డే ఎమ్మెల్యే అని, ఒక్క రోజే అసెంబ్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల్లో శాసనసభలన్నీ పార్లమెంట్ సంప్రదాయాలనే అనుసరిస్తాయని, సెక్షన్ 121 (సీ) ప్రకారం… ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో పదో వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్‌సభలో రూలింగ్ ఉంది. ప్రజాతీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనన్నారు.
లేని అధికారం కోరుకోవడమేంటి?
ప్రతిపక్ష హోదాపై వైసీపీ నేతలు కావాలనే బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) విమర్శలు గుప్పించారు. ‘ జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా ఛీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారు? ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరఫున కోరుతున్నాం. జగన్ అనాలోచిత వ్యాఖ్యలు, మూర్ఖమైన నిర్ణయాలను ఇతరులకు ఆపాదించటం సరికాదు. గత ప్రభుత్వంలో రూ.650 కోట్లతో సలహాదారులు నియమించుకున్నారు. అంతమంది సలహాదారులను నియమించుకుని కనీసం జలజీవన్ మిషన్‌లో రాష్ట్రానికి వచ్చిన ఫండ్‌ను ఉపయోగించలేదు. అసెంబ్లీకే రాని జగన్ ఏ విధంగా ప్రజాసమస్యలపై మాట్లాడతారు. క్రిమినల్ మైండ్‌తో పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? బాబాయ్ హత్య ఏ విధంగా జరిగింది? అనే విషయం అందరికీ తెలుసు. ఎన్నికలకు చాలా రోజులు ఉన్నాయి. పవన్(Pawan Kalyan)ను పదే పదే టార్గెట్ చేస్తే తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేదానికి నిన్నటి ఎన్నికలే నిదర్శనం’ అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.