Ram Gopal Varma
ఎంటర్‌టైన్మెంట్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు సీఐడీ నోటీసులు

Ram Gopal Varma: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు శివ లాంటి కల్ట్ సినిమాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయకపోయినా వివాదాస్పద కామెంట్స్‌తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే చిత్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మూవీని చిత్రీకరించారని కొందరు ఆయనపై ఫిర్యాదు చేశారు. గతంలో ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీ అధికారులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలంటూ రామ్ గోపాల్ వర్మకు అధికారులు నోటీసులు పంపించారు. ఇటీవల కాలంలో ఆయనపై చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు ఆయనకు వరుసగా నోటీసులు అందజేస్తున్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ..ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించాడు. సీఐడీ అధికారుల నోటీసుల విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. మరి హైకోర్టులో ఆర్జీవీకి ఊరట లభిస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: ఒకప్పుడు డెంటిస్ట్‌.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్! 

ఇప్పటికే వ్యూహం చిత్రంకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమాలను చిత్రీకరించారని ఆర్జీవీపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. గతంలో ఒంగోలులో సీఐడీ అధికారుల నోటీసులకు విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు అయిన సంగతి తెలిసిందే. మరోసారి నోటీసులు ఇవ్వడంతో రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే ఇటీవల కూడా ఆర్జీవీకి నోటీసులు పోలీసులు అందజేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. హైదరాబాద్‌లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరవ్వాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టర్లు పోస్ట్ చేశాడని. మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై ఫిర్యాదు చేసారు. దీంతో రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు అందించారు. దీంతో రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేసారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

Just In

01

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి