కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న నేతలు
స్థానికంలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచనలు
నియోజకవర్గాలపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ నిఘా
మహబూబాబాద్, స్వేచ్ఛ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. మహబూబాబాద్(Mahabubabad), ములుగు(Mulugu) జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో(Assembly Constituencies) ఎమ్మెల్యేలు(MLAS) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణపై ప్రత్యేక ఫోకస్ (Special focus) పెట్టారు. గ్రామస్థాయిలో(Village level) వార్డు మెంబర్లు(Ward Members), సర్పంచ్(Sarpanch), ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC), మున్సిపాలిటీల్లో(Municipalities) అత్యధికంగా వార్డు కౌన్సిలర్లను (Ward Councillors) గెలిపించుకొని చైర్మన్ (Muncipal Chairman) పదవిని కైవసం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నారు. అదే విధంగా అత్యధిక ఎంపీటీసీలు గెలుచుకొని ఎంపీపీ(MPP), వైస్ ఎంపీపీ (Vice MPP), మండల స్థాయిలో అత్యధిక జడ్పీటీసీలను గెలిపించుకొని జడ్పీ చైర్మన్, వైస్ జడ్పీ చైర్మన్‌లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రచిస్తున్నారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 18 మండలాల్లోని 487 గ్రామపంచాయతీలు, ములుగు జిల్లా 10 మండలాల్లోని 174 గ్రామపంచాయతీల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగరేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్, రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు శాఖ మంత్రి సీతక్క (Sitakka) పార్టీ శ్రేణుల (Cadre)తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ మార్క్ చూపించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మహబూబాబాద్ తొలి మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవిని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండోసారి జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్(BRS)కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి (Jennareddy Bharath Chandar Reddy) ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్లను గెలిపించుకున్నది. ఈ సారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకొని మండల స్థాయిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, జిల్లాస్థాయి పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు.
ఏఐసీసీ ఇన్‌చార్జ్ ప్రత్యేక నిఘా..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా (AICC Incharge) నూతనంగా నియామకమైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పార్లమెంట్ నియోజకవర్గాలపై (Parlament Constituencies) ప్రత్యేక నిఘా పెట్టారు. మంగళవారం నుంచి వివిధ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నాయకులతో పార్టీ నిర్వహించే కార్యకలాపాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులతో రివ్యూలు నిర్వహిస్తారని పార్టీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల బాస్‌లు.. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రివ్యూ సమావేశాల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాలు.. నాయకుల తీరుతెన్నులపై ప్రత్యేక నివేదిక అందజేసేందుకు ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టారు.
అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం..
‘‘రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకొని తమ సత్తా చాటుతాం. అదే విధంగా నూతనంగా మున్సిపాలిటీ ఆవిర్భవించిన కేసముద్రం సహా మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులతో కలిసి అత్యధిక స్థానాలను గెలుకుకుంటాం. కేసీఆర్ (KCR) తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లు పాలించి ఎనిమిది లక్షల కోట్ల అప్పులను మిగిల్చారు. కేసీఆర్ అహంకార ప్రవర్తనతో ప్రజలు విసుగుచెందారు. కేసీఆర్ నిజాం రాజుల మాదిరిగానే నియంతృత్వ పోకడలతో ప్రజలు విసుగుచెంది.. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజల మన్ననలు పొందుతున్నది.’’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే (Mahabubabad MLA) డాక్టర్ భూక్య మురళీ నాయక్ (Bhukya Murali Naik) ధీమా వ్యక్తం చేశారు.