nagababu
ఆంధ్రప్రదేశ్

Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు

Nagababu: ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థిగా జనసేన (Janasena) నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోటా (MLA Quota) లో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) కు కూటమి అభ్యర్థిగా ఆయన పేరును డిప్యూటి సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖరారు చేశారు. నామినేషన్ (Nomination) వేయాలని, అందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నాగబాబు… జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు కావడంతో ఇన్నాళ్లుగా వచ్చిన ఊహగానాలకు తెరపడినట్లు అయింది. ఆయనకు లోక్ సభ (Lok sabha)కు పంపుతున్నారంటూ, ఎమ్మెల్సీ అంటూ కాదు కార్పొరేషన్ పదవి అంటూ గతంలో రకరకా ఊహాగానాలు వెలవడ్డాయి. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయనను కేబినేట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ (Corporation Chairman) పదవిని కట్టబెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగానే ఆయనకు స్థానం కల్పించినట్లు తాజాగా స్పష్టమైంది.

 

 

Just In

01

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి