cabinet-meeting
తెలంగాణ

Cabinet meeting: 6న తెలంగాణ కేబినెట్ భేటీ; చర్చకు రానున్న పలు కీలక అంశాలు

Cabinet meeting: ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టుల గురించి చర్చించిన విషయం తెలిసిందే. 6వ తేదీన జరిగే సమావేశంలో వాటి గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ అంశాలు కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.

రివ్యూలు మొదలుపెట్టిన మీనాక్షీ మేడం…

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పనితీరు పై సమీక్షలు నేటి నుంచి మొదలయ్యాయి. ఏఐసీసీ నూతన ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ గాంధీభవన్‌లో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో ఈ రివ్యూ మీటింగ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ… మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్ష నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్యనేతలంతా రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.సమీక్షలో ప్రభుత్వ పనితీరు, పార్టీ నిర్ణయాలు తదితర అంశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను మీనాక్షీ సేకరించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం సమీపిస్తుండటంతో దానికి సంబంధించిన అంశాలను కూడా సమావేశంలో చర్చిస్తారని వినికిడి. ఇక, బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థాయిలో నేతలందరితో మీనాక్షీ సమావేశం నిర్వహించనున్నారు.

Also Read: 

MLA Spits Assembly: ఇదేం వికృతం.. అసెంబ్లీలో గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!