David Warner
ఎంటర్‌టైన్మెంట్

David Warner: తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్!

David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అభిమానులకు అయితే ఈయన పేరు తెలియని వారంటూ ఉండరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున డేవిడ్ వార్నర్ ఆడిన సమయంలో టాలీవుడ్ సాంగ్స్‌కి డ్యాన్స్, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాడు. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘డీజే టిల్లు’ లాంటి మూవీస్ హీరోల పేస్ మార్ఫింగ్‌ చేసి తన ఫోటో పెట్టి చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు కొన్ని తెలుగు యాడ్స్‌లో కూడా నటించి అందరిని ఆకర్షించాడు. దీంతో డేవిడ్ వార్నర్ పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. తాజాగా తెలుగు సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడని తెలిసింది. దీనిపై ఆ చిత్ర నిర్మాత ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేశాడు.

సూపర్ హిట్ మూవీస్‌ను ఆడియన్స్‌కి అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌లో డేవిడ్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ సంస్థ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన రవిశంకర్ ఈ విషయాన్ని ‘కింగ్‌స్టన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వెల్లడించాడు. అయితే గతంలో డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఊహాగానాలు నిజం చేస్తూ ప్రొడ్యూసర్ బహిర్గతం చేశాడు.

Also Read: హీరో లేకుండా సినిమా తీస్తా: సందీప్‌ వంగా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్‌’ మూవీలో డేవిడ్ వార్నర్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై క్రేజ్ మరింత బలపడింది. అయితే గతేడాది ఈ మూవీ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ బయటికి కూడా వచ్చాయి. అయితే ‘రాబిన్‌హుడ్‌’ చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎక్కడా కూడా విషయం బయటపెట్టలేదు. ఇంతకాలం దాచుపెడుతూ తాజాగా వెల్లడించారు.

ఇక ‘రాబిన్‌హుడ్‌’ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో భీష్మ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. . వెన్నెల కిషోర్, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇతరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నితిన్.. రాబిన్ హుడ్ అనే దొంగ పాత్ర‌లో కనిపించనున్నాడు. ఈ మూవీ మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక కేతికా శర్మ స్పెషల్‌ సాంగ్‌‌లో అలరించనుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?