chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోకి ట్రైన్‌లో ఫస్ట్ నైట్!

Tollywood: సినీ ప్రపంచంలో స్టార్ డమ్ తెచ్చుకుంటే చాలు అవకాశాలు అవంతట అవే వస్తాయి. వరుస పెట్టి దర్శకనిర్మాతలు హీరో, హీరోయిన్స్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక సినిమాలతో బిజీ అవ్వడం వల్ల ఫ్యామిలీస్‌ని పట్టించుకోడం సినీ స్టార్స్‌కి కష్టమే అని చెప్పాలి. ఇటు సినిమాలు, అటు ఫ్యామిలీ.. రెండు బ్యాలెన్స్ చేయడం ఇబ్బందే. మరి ముఖ్యంగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోలు ఇలాంటి పరిస్థితులు ఎదురుకున్న వారెందరో ఉన్నారు. ఒక హీరో అయితే తన పెళ్ళికి మూడు రోజులు మాత్రమే లీవ్స్ పెట్టాడట. అంతేకాదు, ఆ హీరోకి డైరెక్టర్ ఫస్ట్ నైట్ కూడా ట్రైన్‌లోనే ఏర్పాటు చేశాడట. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల కోసం అప్పట్లో అందరూ ఎదురుచూసేవారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఉన్న అభిమానులు అంత ఇంత కాదు. అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ఎంతో మంది హృదయాలను దోచుకున్నాడు. 1978లో పునాది రాళ్లు అనే చిత్రంలో సినీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రాణం ఖరీదు అనే చిత్రం దాని కన్నా ముందు విడుదల అయ్యింది. ఖైదీ, మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకెళ్లాడు. ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా, హిట్లర్, మాస్టర్ , బావగారూ బాగున్నారా?, చూడాలని వుంది, స్నేహం కోసం ఇలాంటి సూపర్ హిట్ మూవీస్ ఆయన ఖాతాలో ఎన్నో ఉన్నాయి.

ఆ తర్వాత ఠాగూర్, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, స్టాలిన్ వంటి చిత్రాల్లో నటించి 2006లో సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయ ప్రవేశం చేసాడు. అయితే మళ్ళీ 2017లో ఖైదీ నెం.150 అనే చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆయన 150వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ మంచి హిట్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్‌లో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది చిరంజీవి పుట్టిన రోజున ఆగష్టు 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

chiranjeevi

Also Read: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!

ఇదిలా ఉంటే.. రొమాంటిక్ సీన్లకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ కే.రాఘవేంద్ర రావు అని మనందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పెళ్లి సమయంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. టైమ్ లేకుండా మూవీ షూటింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మెగాస్టార్ పెళ్ళికి మూడు రోజులు మాత్రమే సెలవులు పెట్టాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేదట. రాఘవేంద్ర రావు మూవీ కోసం చిరంజీవి ఊటీకి వెళ్లాడు. ఇక ఒకరోజు ట్రైన్‌లో మెగాస్టార్ చెన్నై వెళ్లాల్సి వచ్చింది. దీంతో రాఘవేంద్ర రావు స్పెషల్‌గా చిరంజీవి దంపతులకు టిక్కెట్లు బుక్ చేసి.. వాళ్ల బెర్త్‌ల్లో పూలు, ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ సెటప్ చేశాడట. అంతేకాదు డెకరేషన్ కూడా చేయించాడట. అయితే మెగాస్టార్ జంటకు ట్రైన్ ఎక్కే వరకు కూడా ఈ విషయం తెలియదట. దీంతో చిరంజీవి, సురేఖ ఆశ్చర్యానికి గురయ్యారట. అలా మొత్తానికి రాఘవేంద్రరావు చిరంజీవి, సురేఖ దంపతులకు సర్‌ప్రైజ్ చేశాడట.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?