Mlc Election : ఏపీలోని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు (Gade Srinivas) ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూటమికి షాక్ తలిగింది. కూటమి పార్టీలు మద్దతు ఇచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మ మీద రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేశారు. మరి కాసేపట్లో అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.