GV-Prakash-Kingston
ఎంటర్‌టైన్మెంట్

GV Prakash Kingston: మనకి అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథే ‘కింగ్స్టన్’

GV Prakash Kingston: సంగీత దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళుతున్న సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగానూ మధ్యమధ్యలో దర్శనమిస్తుంటాడు. ఆయన తాజాగా హీరోగా నటించిన చిత్రం ‘కింగ్స్టన్’. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకంపై జీవీ ప్రకాష్ కుమారే నిర్మించారు. నిర్మాతగా ఆయనకు ఇది తొలి చిత్రం. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7, శుక్రవారం విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలుగు మీడియాకు తెలియజేశారు హీరో, నిర్మాత జీవి ప్రకాష్ కుమార్. ఆయన మాట్లాడుతూ..

‘‘సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు నెర్వస్‌గా ఫీలవుతుంటాను. ఇంకా విడుదలకు నాలుగు రోజులే‌ ఉంది.. మూడు రోజులే ఉంది అని లెక్కలేసుకుంటూ ఉంటాను. నేనే కాదు, అందరూ ఇలానే చేస్తారని అనుకుంటున్నాను. ఒక సినిమాను నిర్మించాలని కొన్ని రోజులుగా అనుకుంటున్నాను‌. ‘కింగ్స్టన్’ కథ విన్న తర్వాత ఎంతగానో నచ్చింది. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించాను. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇటువంటి సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను. ‘కింగ్స్టన్’ను ఫ్రాంచైజీలా చేయాలని అనుకుంటున్నాం. మా దగ్గర నాలుగు పార్టుల వరకు కథ రెడీగా ఉంది.

Also Read- Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్

‘కింగ్స్టన్’ కథ గురించి చెప్పాలంటే.. సముద్ర తీరం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఉండే జాలరి పాత్రని ఇందులో నేను చేశాను. సాధారణంగా జాలర్లు సముద్రంలో వేటాడడానికి వెళతారు. అయితే ఆ ఊరి ప్రజలు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లరు. ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటి? ఆ శాపాన్ని ఎదిరించాలని సముద్రంలోకి వెళ్లిన హీరోకి ఏం జరిగింది. నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ సీ‌ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ఇదని అనుకుంటున్నాను. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హీరోకు జాంబీలు, ఆత్మలు ఎదురవుతుంటాయి. కచ్చితంగా ప్రేక్షకులు ఇంతకు ముందు ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాను చూసి ఉండరని చెప్పగలను.

ఇందులో అండర్ వాటర్ సీక్వెన్సుల కోసం నాలుగు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత దాదాపు మూడు నిమిషాల పాటు పైకి రావడానికి ఉండదు. శ్వాసను ఎలా ఆపాలి? అనే దాంతో పాటు యాక్షన్ కోసం కొంత ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలో ఉన్నప్పుడు వన్ మోర్ టేక్ అనేవారు. అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. హీరోగా ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినా, శారీరకంగా నన్ను ఎక్కువ కష్టపెట్టిన సినిమా అయితే ఇదే. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు తడిగా ఉండటంతో జారిపడే వాళ్లం. అలా బాగానే గాయాలయ్యాయి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసిన రోజులున్నాయి. అంత కష్టం పడ్డాం కాబట్టే యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఒక బోటు మీద ఆర్టిస్టులు ఉంటే మరొక బోటు మీద కెమెరా ఉండేది. అలా ఛాలెంజింగ్ సీన్లు చాలానే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత హాలీవుడ్ కూడా ఆశ్చర్యపోతుంది. ఈ సినిమా ఎలా చేశారని వాళ్లు తప్పకుండా అడుగుతారు.

హీరోగా 25 సినిమాలు, సంగీత దర్శకుడిగా 100 సినిమాలు.. ఒకేసారి ఈ మైలురాయిని చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘ప్రేమ కథా చిత్రం’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’తో హీరోగా పరిచయమయ్యాను. అప్పటినుంచి సినిమాలు చేస్తూ వచ్చాను. తమిళ్‌లో మంచి విజయాలు వచ్చాయి. ఒక షెడ్యూల్ ప్రకారం పని చేసుకుంటూ వెళ్లిపోతాను. యాక్టింగ్, మ్యూజిక్ ఈ రెండింటికి కొంత టైమ్ డివైడ్ చేసుకుంటాను. వీటిలో ఏదైనా షెడ్యూల్ మిస్ అయితే ప్లాన్ బి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. దీపావళికి నేను మ్యూజిక్ అందించిన చిత్రాలు తెలుగులో ‘లక్కీ భాస్కర్’, తమిళంలో ‘అమరన్’ విడుదల అయ్యాయి. ఆ రెండింటికి చాలా మంచి పేరు వచ్చింది. నేను హీరోగా నటించే సినిమాల కంటే బయట సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని అంతా అంటూ ఉంటారు. కథను బట్టి సంగీతం ఇస్తున్నా. నా సినిమాల కోసం అంటూ స్పెషల్‌గా ఏమీ వర్క్ చేయను. ‘కింగ్స్టన్’ కోసం కొత్త తరహా సౌండ్స్ కొన్ని వినిపించే ప్రయత్నం చేశాను.

GV-Prakash-Kumar
GV-Prakash-Kumar

ఇది నేను నిర్మిస్తున్న మొదటి చిత్రం. మంచి కథ దొరికితే ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ. ‘కింగ్స్టన్’ తర్వాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించబోతున్నాను. ఆ కథ చదివిన తర్వాత నాకు విపరీతంగా నచ్చింది. నేను ప్రొడ్యూస్ చేయవచ్చా అని నేనే ఆయనని అడిగా. నేను హీరోగా నటించే సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలనేలా రూల్ ఏమీ పెట్టుకోలేదు. డైరెక్ట్ తెలుగు సినిమా అంటే, ఒకసారి అవకాశం వచ్చింది. ‘దసరా’ సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్నే ఫస్ట్ అడిగారు. కానీ నేనప్పుడు చాలా బిజీగా ఉన్నాను. వారేమో రెండు వారాల్లో షూటింగ్ ఉంటుందని చెప్పారు. దాంతో, డేట్స్ అడ్జస్ట్ చేయలేకపో ఆ సినిమా వదిలేశా. మంచి కథ వస్తే భవిష్యత్‌లో తప్పకుండా తెలుగులో సినిమా చేస్తాను.

హీరోయిన్ దివ్యభారతి గురించి చెప్పాలంటే.. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ సినిమా చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని చర్చలు జరిగాయి. మంచి కాంబినేషన్ అయితే బాగుంటుందని ఆ సంస్థ కూడా దివ్యభారతి పేరు సజస్ట్ చేసింది. ఈ సినిమాలో దివ్య యాక్షన్ సీక్వెన్స్ చేసింది. ఆమెకు సినిమా విడుదల తర్వాత చాలా మంచి పేరు వస్తుంది. ‘కింగ్స్టన్’ సినిమా గురించి ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటే. ‘బాహుబలి’ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘కాంతార’ సినిమా ప్రేక్షకులను స్పిరిచువల్ వరల్డ్‌లోకి‌ తీసుకెళ్లింది. ఈ ‘కింగ్స్టన్’ సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని నమ్మకంగా చెప్పగలను. హాలీవుడ్ దర్శకనిర్మాతలు వాళ్ల కథలను చెబుతున్నారు. మేము ఈ ‘కింగ్స్టన్’ ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం’’ అని జీవీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:
MAD Square vs Robinhood: ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ రోజే ‘మ్యాడ్ స్క్వేర్’.. నిజంగా అమావాస్యే కారణమా?

Vidya Balan: ఆ వీడియోలు నావి కావు.. డీప్ ఫేక్ బారిన విద్యాబాలన్

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!