The Paradise Glimpse: ‘ఒక థగడొచ్చి మొత్తం జాతిలో జోష్ దెచ్చిండు. ఆట్.. తూ అనిపించుకున్న కాకులు తల్వార్‌లు బట్టినయ్’.. ఏంటిది అనుకుంటున్నారా? నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సినిమా డైలాగ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ తర్వాత మరోసారి నాని చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. రీసెంట్‌గా నాని పుట్టినరోజు స్పెషల్‌గా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలకు సంబంధించిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన ప్రకారం సోమవారం ఈ చిత్ర గ్లింప్స్‌ని ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే, ఒక్కటే మాట ‘అరాచకం’. ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. అలా కట్ చేశారీ గ్లింప్స్‌ని. ఈ గ్లింప్స్ విషయానికి వస్తే..
Also Read- Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్
ఒక్కటే డైలాగ్
‘‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించే రాసిర్రు గానీ, గదే జాతిలో పుట్టిన కాకుల గురించి బయంగందీ రాయలే. తిందికిమిరి. ఇది కడుపు మండిన కాకుల కథ. జమనా జమనా కెళ్లి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి బెంచిన ఒక జాతి కథ. ఒక థగడొచ్చి మొత్తం జాతిలో జోష్ దెచ్చిండు. ఆట్.. తూ అనిపించుకున్న కాకులు తల్వార్‌లు బట్టినయ్. గిది ఆ కాకులను ఒక్కటి జేసిన ఒక లం* కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ. నీ **’’ అంటూ ఒక తల్లి తన కొడుకు గురించి చెబుతున్నట్లుగా ఉన్న ఈ రా స్టేట్‌మెంట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే కెజియఫ్ చరిత్రని తిరగరాసే సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోతుందనే ఫీల్‌ని ఇస్తుంది. కాకులను నమ్ముకున్న చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద భంగపడినట్లుగా చరిత్రలో లేదు. అది ఈ మధ్య వచ్చిన ‘బలగం’ సినిమా కూడా నిరూపించింది. ఇప్పుడు కాకులపై ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ బేస్డ్ సినిమాగా వస్తున్న ‘ది ప్యారడైజ్’ మరో చరిత్ర సృష్టించబోతుందనే దానికి సాక్ష్యంగా ఈ రా స్టేట్‌మెంట్ నిలుస్తుందనడంలో అస్సలు అతిశయోక్తి లేనే లేదు.
ఒక్కో ఫ్రేమ్ అరాచకం
ఇక ఇందులో నేచురల్ స్టార్ నాని కనిపించిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక తల్లి వాయిస్ ఓవర్ చెబుతుంటే, స్క్రీన్‌పై కనిపించే ఒక్కో సన్నివేశం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా నానినీ సరికొత్త అవతార్‌లో ఈ సినిమాలో చూడబోతున్నామనేది ఈ టీజర్ స్పష్టం చేసింది. ‘దసరా’నే అనుకుంటే, దానికి డబుల్ రెట్ల మాస్ యాక్షన్ సినిమా అనేది ఈ రా స్టేట్‌మెంట్‌లో ఒక్కో ఫ్రేమ్ తెలియజేస్తుండటం విశేషం. మొత్తంగా అయితే నాని, శ్రీకాంత్ ఓదెల స్క్రీన్ తగలబడే సినిమాను రెడీ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఆ బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం వచ్చే సంవత్సరం మార్చి 26 వరకు ఆగాల్సిందే. అవును ఈ సినిమా విడుదల తేదీని కూడా ఈ టీజర్‌లో ప్రకటించారు. 26, మార్చి 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
MAD Square vs Robinhood: ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ రోజే ‘మ్యాడ్ స్క్వేర్’.. నిజంగా అమావాస్యే కారణమా?
Vidya Balan: ఆ వీడియోలు నావి కావు.. డీప్ ఫేక్ బారిన విద్యాబాలన్