Sugarcane Juice
లైఫ్‌స్టైల్

Summer Drinks: సమ్మర్ స్పెషల్.. చెరుకు రసం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Summer Drinks: వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు దాహంతో అల్లాడిపోతుంటారు. సూర్యుడి తాపం నుంచి తప్పించుకునేందుకు శీతల పానియాలు, జ్యూసులను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా సమ్మర్ లో చాలా మంది చెరుకు రసాన్ని తాగేందుకు ఇష్టపడతారు. ఒకప్పుడు గ్రామాలకు పరిమితమైన ఈ చెరుకు రసం (Sugarcane Juice).. ప్రస్తుతం నగరాల్లోనూ విస్తృతంగా లభిస్తోంది. మండుటెండల్లో ఉపశమనం పొందేందుకు చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి తాపాన్ని తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని పేర్కొంటున్నారు. మరి వేసవిలో ప్రతిరోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగడం వల్లే కలిగే ప్రయోజనాలేంటో ఈ ఇప్పుడు చూద్దాం.

డీ హైడ్రేషన్ నుంచి రక్షణ

వేసవి కాలంలో డీ హైడ్రేషన్ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. అటువంటి వారికి చెరుకు రసం మంచి ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు. చెరుకు రసం తీసుకుంటే డీహైడ్రేషన్ బారి నుంచి క్షణాల్లో ఉపశమనం పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు.

తక్షణ ఎనర్జీ

మానవ శరీరానికి అవసరమైన పోషకాలు.. చెరుకు రసంలో మెండుగా ఉన్నాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియంను సమృద్ధిగా దీని నుంచి పొందవచ్చు. గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ కూడా పుష్కలంగా ఉండటంతో చెరుకు రసం నుంచి తక్షణ ఎనర్జీ లభిస్తుంది.

Read Also: Illegal immigration: ట్రంపా మజాకా.. అమెరికాలో భారీగా తగ్గిన అక్రమ వలసలు

రోగనిరోధక శక్తి బలోపేతం

పిల్లల్లో తరచూ వచ్చే చిన్న చిన్న అనారోగ్యాల సమస్యల నుంచి చెరుకు రసం ఉపశమనం కలిగిస్తుంది. తీవ్ర జ్వరం, అలసటగా ఉండటం వంటి సమస్యల నుంచి వారిని కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలోపేతానికి సైతం చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

బరువు తగ్గడానికి సాయం

అధిక బరువుతో బాధపడేవారికి చెరుకు రసం దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొవ్వును చెరుకు రసం గణనీయంగా తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు.

మెరుగైన జీర్ణ వ్యవస్థ

వేసవి కాలంలో చాలా మందిలో జీర్ణ వ్యవస్థ సమస్యలు తలెత్తుతుంటాయి. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆకలి లేకపోవడం వంటివి చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అటువంటి సమస్యలకు చెరుకు రసంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మ కాంతికి రక్షణ

చెరుకు రసం రోజు తీసుకునే వారి కాంతి వంతంగా మెరిసిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖంపై వచ్చే మెుుటిమలను సైతం చెరుకు రసం నియంత్రిస్తుందని చెబుతున్నారు. సమ్మర్ లో కాంతివంతమైన చర్మాన్ని కోరుకునే వారు చెరుకు రసం తీసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.

 

 

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?