Summer Skin Care: తెలుగు రాష్ట్రాల ప్రజలు వేసవి కాలంలోకి అడుగుపెట్టేశారు. మార్చిలోకి ఇప్పుడే ఎంటర్ అయినప్పటికీ వాస్తవానికి ఫిబ్రవరి నుంచే ఎండ తీవ్రత భారీగా పెరిగిపోయింది. అటు వేసవిలో యూత్ ను బాగా వేధించే సమస్యల్లో చర్మ సౌందర్యం ప్రధానమైనది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్ది చర్మంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. చర్మం పొడి బారి కాంతి విహీనంగా, నిర్జీవంగా మారుతుంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా మండే వేసివిలోనూ మెరిసే మేని ఛాయను సొంతం చేసుకోవచ్చు. ఆ మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సన్ స్క్రీన్లు వాడటం
సూర్య కాంతిలోని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై పడకుండా సన్ స్క్రీన్ లోషన్స్ అడ్డుగోడగా నిలబడతాయి. ఎండలో మన స్కిన్ ను సురక్షితంగా ఉంచుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్స్ ఓ ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం మార్కెట్ లో పలు బ్రాండ్లకు చెందిన సన్ స్క్రీన్ లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF)30 ఉండేది ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మాయిశ్చరైజర్లు
ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో చర్మం త్వరగా తేమను కోల్పోయి పొడి బారిపోతుంటుంది. పొరలు పొరలుగా విడిపోయి చికాకు తెప్పిస్తుంటుంది. కాబట్టి మృధువైన చర్మం కోసం మాయిశ్చరైజర్లు వినియోగిస్తే మంచిది. ఈ మాయిశ్చరైజర్లు ఎండ వేడిమి నుంచి మీ స్కిన్ ను రక్షించి ఉపశమనం కలిగిస్తాయి. మార్కెట్లో ప్రస్తుతం చాలా రకాల మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉన్నాయి. మీ చర్మానికి సరిపోయే క్రీమ్ ను ఎంచుకొని ఈ సమ్మర్ లో ఉపయోగించండి.
Also Read: Starmer Zelensky: ట్రంప్ నకు భారీ ఝలక్.. ఉక్రెయిన్ కు అండగా రంగంలోకి బ్రిటన్
సున్నితమైన క్లెన్సర్ వినియోగం
వేసవిలో చర్మం త్వరగా వేడెక్కి వేగంగా చెమట పట్టేస్తుంటుంది. దీంతో ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకున్నా మురికిగానే అనిపిస్తుంటుంది. కాబట్టి ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం సున్నితమైన క్లెన్సర్ ను ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల చర్మంపై ఉండే జిడ్డు, బ్యాక్టీరియా తొలగిపోతుందని చెబుతున్నారు. చర్మం డీహైడ్రేట్ కాకుండా, పొడిబారకుండా కూడా ఈ క్లెన్సర్ విధానం ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు.
ఎక్స్ఫోలియేషన్
సాధారణంగా యువతులు, మహిళలు బయటకు వెళ్లే ముందు అందంగా ముస్తాబు అవుతారు. ముఖానికి మేకప్, ఫేస్ క్రీములు అప్లై చేస్తుంటారు. అయితే వేసవిలో ఆ కాస్మెటిక్స్ ఉత్పత్తులు చర్మం లోతులకు చొచ్చుకెళ్లి అంద విహీనంగా కనిపించేలా చేస్తాయి. అలాంటి సందర్భాల్లో ఎక్స్ఫోలియేషన్ చేయాలి. దీని వల్ల చర్మం తళ తళా మెరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
సీరమ్ వినియోగం
వేసవిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు ముఖం పొడిబారి దురదగా అనిపిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో వాటర్ బేస్ డ్ సీరమ్ ను ఉపయోగిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. సీరమ్ అప్లై చేస్తే చర్మం లోతు నుంచి హైడ్రేట్ గా మారుతుంది. తద్వారా మృదువుగా, ఎంతో కోమలంగా మీ ముఖం కనిపిస్తుంటుంది.