Priyamani
ఎంటర్‌టైన్మెంట్

Priyamani: హీరో తరుణ్‌తో ప్రియమణి లవ్.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్?

Priyamani: నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకంటూ ప్రత్యేకమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో ప్రియమణి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పెళ్ళైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, హరే రామ్, కింగ్, ద్రోణ, శంభో శివ శంభో, గోలీమార్ వంటి హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదటి పెట్టింది. సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోయింది. మూవీస్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అయితే ప్రియమణికి సంబంధించిన రూమర్స్ ఎప్పుడు హల్ చల్ అవుతూనే ఉంటాయి. సినీ కెరీర్ ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే హీరో తరుణ్-ప్రియమణి జంటగా ‘నవ వసంతం’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇక వీరిద్దరు పీటల వరకు వెళ్లి ఆగిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఉట్టి పుకార్లే అని కొట్టిపారేసింది. ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు రాస్తారో అర్థం కాదని పేర్కొంది. తనపై ఇలాంటి వార్తలు రాస్తే పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తా అని హెచ్చరించింది. వ్యూస్ కోసం ఇలా ఎందుకు చేస్తారని ప్రశ్నించింది. వేరే వ్యక్తుల పర్సనల్ లైఫ్‌కి భంగం కలిగించవద్దని సూచించింది.

Also Read: మెగాస్టార్ చిరంజీవికి ఆ దేశ పౌరసత్వం.. క్లారిటీ!

ఇక ప్రియమణి 2017లో ముస్తాఫారాజ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. ఇటీవల మరో వార్త బాధపెట్టిందని తెలిపింది. లవ్‌ జిహాద్‌ ఆరోపణలు కూడా వచ్చాయని పేర్కొంది. పిల్లలు పుట్టాక వారిని ఐసిస్‌లో చేర్పిస్తారా? అంటూ కామెంట్స్ పెట్టారని బాధపడింది. ఇంకా తనతో పాటు నా భర్తపై కూడా విమర్శలు చేస్తున్నారని పేర్కొంది. ఇలా విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొంది. ఎప్పుడైన సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తే.. 10 మందిలో 9 మంది బ్యాడ్ గానే కామెంట్స్ పెడుతున్నారని తెలిపింది. ఇలా రూమర్స్ తో ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్‌సిరీస్‌లో ప్రియమణి యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా రెండు సీజన్స్ ఈ వెబ్‌సిరీస్‌ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో మూడో సీజన్ కూడా విడుదల కానుంది. మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో ప్రియమణి భార్య పాత్ర పోషిస్తుంది. ఇటీవల సిరీస్ గురించి, దర్శకుడు మణిరత్నం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడవ సీజన్‌ కోసం ఎక్సయిటింగ్ ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశించింది. ఇంకా దర్శకుడు మణిరత్నం అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. గతంలో తాను నటించిన ‘రావన్’ అనే చిత్రానికి డైరెక్షన్ వహించారని పేర్కొంది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?