Ap Govt : ఏపీలో టీచర్ల బదిలీలపై (Teachers Transfers) ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీలకు సంబంధించిన ముసాయిదా మీద ఈ నెల 7లోపు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. కొత్త విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపే బదిలీలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
అందులో భాగంగానే ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు, 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న టీచర్లను నాలుగు కేటగిరి లుగా విభజించారు. ఈ ముసాయిదా ప్రకారం బదిలీలకు సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే అసెంబ్లీలో దీనిపై బిల్ ప్రవేశ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.