Sajjala Ramakrishna Reddy : సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టు మెట్లు ఎక్కారు. పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) ఇచ్చిన ఎఫెక్ట్ తో ఎప్పుడు అరెస్ట్ అవుతామో అనే టెన్షన్ పట్టుకుంది. దాంతో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి (Bhargav Reddy) పిటిషన్లు వేశారు. నటుడు పోసాని కృష్ణమురళి తాను సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారమే పవన్ కల్యాణ్, చంద్రబాబులను, వారి ఇంట్లో వారిని తిట్టానని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
దాంతో ఈ కేసులో రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి అరెస్ట్ అవుతారనే సంకేతాలు మొదలయ్యాయి. దాంతో వీరిద్దరూ అలెర్ట్ అయి పిటిషన్లు వేశారు. ‘పోసాని పోలీసులు ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మా పేర్లు చెప్పారు. అసలు ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం అమాయకులం. మాకు గుంటూరు, పులివెందులలో శాశ్వత నివాసాలు, ఆస్తులు ఉన్నాయి. మేం ఎక్కడికీ పారిపోలేదు. మమ్మల్ని కక్షగట్టి ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే టెన్షన్ ఉంది. మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి’ అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
చూస్తుంటే వీరిద్దరి అరెస్ట్ తప్పదేమో అనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోసాని అరెస్ట్ తో తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. లిస్టులో వీరిద్దరి పేర్లు కూడా ఉన్నాయంటున్నారు కూటమి నేతలు. చూడాలి మరి ఏం జరుగుతుందో.