Anil Ravipudi
ఎంటర్‌టైన్మెంట్

Anil Ravipudi: హీరోయిన్‌తో కెమిస్ట్రీ.. పోలీస్‌స్టేషన్‌కు డైరెక్టర్ అనిల్ రావిపూడి

Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు తీస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్‌లో 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్‌లలో అనిల్ రావిపూడి ఒకరనే చెప్పాలి. అనిల్ ఇప్పటివరకు తీసిన మూవీస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి కౌదరి హీరోయిన్స్‌గా నటించారు. వెంకటేష్ కెరీర్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి సైబర్ క్రైం పోలీసులను పోలీసులకు కంప్లైంట్ చేయడం అందరిని ఆశ్ఛర్యానికి గురి చేసింది. అసలు అనిల్ రావిపూడి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశాడనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ.. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకోండి అన్నారు. మీ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని సరదాగా పేర్కొంది. వెంటనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏమి లేవని పేర్కొన్నాడు. ఇప్పటికే యూట్యూబ్‌లో తమ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు రరకాలుగా రాస్తున్నారని తెలిపాడు. తానేమో సినిమాల బిజీలో పడ్డానని, వాళ్ళొమో తన గురించి ఏదేదో తప్పడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తమ బంధువులు, చుట్టూ పక్కల వారు.. ఆ వీడియోలు తన భార్యకు, కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారని ఫీల్ అయ్యాడు. తనపై ఇక నుంచి తప్పుడు ప్రచారం చేయొద్దని, ఇప్పటికే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపాడు.

Meenakshi Chaudhary

Also Read: ఫస్ట్ మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే 5 సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ ! 

ఇప్పటికైనా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తప్పుడు వీడియోలు డిలీట్ చేయండని హెచ్చరించాడు. లేదంటే మీ యూట్యూబ్ ఛానెల్స్ పోతాయని వార్నింగ్ ఇచ్చాడు. తనకు ఎలాంటి కెమిస్ట్రీలు లేవని, తన గురించి కొత్తకొత్త కథలు సృష్టిస్తున్నారని వాపోయాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం లేనిపోనీ కథలు అల్లకండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు. పెద్దపెద్ద స్కిప్ట్స్, వాయిస్ ఓవర్స్‌తో వీడియోలు వదులుతున్నారని, అవి చూసిన జనాలు నిజమే అనుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి రాయడం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. నిజాలు తెలుసుకోకుండా ఎవరిపైన కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరాడు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు