Chandrababu : నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే 90 దశకంలో రాజకీయాలను మలుపు తిప్పిన నేతలు. టీడీపీ రాజకీయ చరిత్రలో వీరిద్దరికీ సెపరేట్ పేజీలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన తర్వాత నుంచే తోడళ్లుడు వెంకటేశ్వరరావుతో దూరం పెరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగానే ఉంటూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివిర్సిటీలో ఈ వేడుక జరగబోతోంది. గత కొన్ని రోజులుగా మళ్లీ వీరిద్దరూ ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి. మరి ఇందులో ఏం మాట్లాడుతారో.. తమ పాత జ్ఞాపకాలను ఏమైనా గుర్తు చేసుకుంటారో లేదో అనేది చూడాలి.