Politics

ధరణి స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు ఏం చేస్తారంటే..!

నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తో్న్న సంగతి తెలిసిందే. ఈ నెల మార్చి 9 వరకూ సాగనున్న ఈ డ్రైవ్‌లో అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ.. ధరణి వెబ్‌సైట్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించనున్నారు. దీనికోసం ప్రతి మండలంలోనూ రెండు, మూడు బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. అవసరమైతే పంట పొలాలు, వ్యక్తిగత స్థలాల వద్దకు వెళ్లి అధికారులు వాటి వివరాలను పరిశీలించటంతో బాటు వీలుంటే వెంటనే పరిష్కరిస్తారు. ఏదైనా సమాచారం కొరవడితే.. దాని మీద ఒక నివేదికనూ తయారుచేయనున్నారు. ఈ అధికారాన్ని సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది.

క్షేత్ర స్థాయిలో తమ పరిశీలన పూర్తి కాగానే.. అధికారులు తాము తయారుచేసిన నివేదకను భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (CCLA)కి పంపుతారు. అదే సమయంలో సంబంధిత పని ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని కూడా సదరు దరఖాస్తుదారుకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మార్చి 9 వరకు తహశీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, CCLA అధికారులు పెండింగ్‌లో 2,45,037 దరఖాస్తుల మీద కసరత్తుకు సిద్ధమయ్యారు.

గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తుల్లో పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేయాల్సినవి ఉండగా, మిగిలనవి మరో 17 రకాల సమస్యలకు సంబంధించినవి. ఇక.. ధరణి సమస్యలున్న వారంతా మార్చి 9 వరకూ అధికారులకు అందుబాటులోకి ఉండేందుకు సిద్ధంగా ఉండాలని స్థానిక అధికారులు దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు. అలాగే.. భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉంటే అధికారులు వెంటనే మీ సమస్యను పరిష్కరించే వీలుంటుంది. ముఖ్యంగా పేర్లలో తప్పులు, చిరునామా, భూమి విస్తీర్ణం వంటి సమస్యలుంటే వాటిని అధికారులు అక్కడిక్కడే వాటిని సరిచేసి, కొత్త సమాచారాన్ని CCLAకి పంపి, ఆ సమస్య పరిష్కారం ఎంతవరకూ వచ్చిందో ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్‌ మెసెజ్‌లు పంపుతారురు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కాగానే.. ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఉంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

భూమికి సంబంధించిన హక్కులను పరిరక్షించేందుకు, భూరికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తూ వారిలో ఇన్నాళ్లుగా నెలకొన్న భయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎప్పటికప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ఈ కమిటీలో కన్వీనర్‌గా భూ పరిపాలన ప్రధాన కమీషనర్ నవీన్ మిట్టల్, సభ్యులుగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణులు మాభూమి సునీల్, విశ్రాంతి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, బి మధుసూదన్ ఉన్న సంగతి తెలిసిందే.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?